Ads
టాలీవుడ్ కు సంక్రాంతి ప్రతిసారి కూడా ఒక అద్భుతమైన అవకాశం గా మారుతుంది. ఈ ఫెస్టివల్లో కాస్త పాజిటివ్ టాక్ అందుకున్న సినిమాలు కూడా భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తూ ఉంటాయి. అందుకే ప్రతిసారి కూడా పోటీ తీవ్రత ఎంత ఉన్నా కూడా సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు మేకర్స్. ఈ సారి సంక్రాంతికి కూడా అతిపెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి.
Video Advertisement
గత రెండేళ్లలో సంక్రాంతి సినిమా సమరం అంతగా లేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో పెద్ద చిత్రాల మధ్య పోటీ లేకుండా పోయింది. అయితే 2023 మాత్రం అతిపెద్ద బాక్సాఫీస్ వార్ కి సిద్ధం అవుతుందని తెలుస్తోంది.
ఈ పోటీలో మొత్తం ఎన్ని సినిమాలు ఉన్నాయి అని వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన 154 సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పై ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. కానీ దాదాపు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది సంక్రాంతి బరి లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద వరుసగా దారుణమైన ఫలితాలతో సతమతమవుతున్న ప్రభాస్ ఈ సారి ఆదిపురుష్ సినిమాతో పండుగ వాతావరణాన్ని ఉపయోగించుకుని సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా సంక్రాంతికి వస్తుందని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే మరొక వైపు విజయ్ నటించిన వారసుడు సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇదివరకే ఒక వివరణ ఇచ్చారు చిత్ర బృందం.
అలాగే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మరొక సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇది కూడా సంక్రాంతి బరి లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ మూవీ కూడా సంక్రాంతికే విడుదల కాబోతుందని సమాచారం.
దీంతో 2023 జనవరిలో ప్రభాస్, చిరంజీవి, బాలయ్య, విజయ్, అఖిల్ తమ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నారట. మరి ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో ఎవరు నెంబర్ వన్ స్థానంలో నిలుస్తారో చూడాలి.
End of Article