సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూశారు. అనుకున్నట్టుగానే సినిమా సూపర్ హిట్ అయ్యింది. గత సంవత్సరం విడుదలైన సినిమాల్లో ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమాల్లో ఒకటిగా అఖండ నిలిచింది.

Video Advertisement

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రలో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు.

heroine scene mistake in akhanda goes viral

అఖండ సినిమాలో మురళీ కృష్ణగా, అఖండగా రెండు పాత్రల్లో నటించారు బాలకృష్ణ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు . అఖండ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత పెద్ద ప్లస్ పాయింట్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అఖండ సినిమాలోని ఒక పొరపాటు ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే, సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించిన ప్రగ్యా జైస్వాల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక విషయంపై పోలీస్ ని నంబర్ అడిగి ఆ నంబర్ కి ఒక ఫోటో వాట్సాప్ లో పంపించాను అని చెప్తుంది.

heroine scene mistake in akhanda goes viral

కానీ ఒకసారి సరిగ్గా ఆమె డయల్ చేసిన కీప్యాడ్ గమనిస్తే, అక్కడ పోలీస్ చెప్పిన నంబర్ ఒకటి, ఆమె డయల్ చేసిన నంబర్ ఒకటి ఉంటుంది. అది మాత్రమే కాకుండా “కీప్యాడ్ లో డైరెక్ట్ గా నంబర్ టైప్ చేస్తే వాట్సాప్ కి ఎలా మెసేజ్ వెళుతుంది? ముందు నెంబర్ సేవ్ చేసుకోవాలి కదా? తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఫోటో పంపించాలి కదా? ఇంత చిన్న లాజిక్ కూడా ఎలా మర్చిపోతున్నారు?” అని ట్రోల్ చేస్తున్నారు.

watch video :