“బ్రహ్మోత్సవం” సినిమాలో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?

“బ్రహ్మోత్సవం” సినిమాలో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?

by Mounika Singaluri

Ads

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ నటించిన `బ్రహ్మోత్సవం` భారీ అంచనాల నడుమ 2016 మే 20న రిలీజై.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. అంతకు ముందు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసిన నేపథ్యం లో మహేష్ ఈ చిత్రాన్ని ఓకే చేసినట్లు టాక్. అయితే ఫామిలీ చిత్రాలు తీయడం లో సిద్ధహస్తుడు అయిన శ్రీకాంత్ అడ్డాల కథ, కథనం, పాత్రల విషయాల్లో ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. దీంతో ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది.

Video Advertisement

ఈ చిత్రం మహేష్ కెరీర్ లో ఆల్ టైం డిజాస్టర్స్ లో ఒకటి. నిజానికి ఈ సినిమా ప్రారంభానికి ముందే మహేష్ ను చాలా మంది హెచ్చరించారట. నిజానికి శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రం కథని ముందు ఎన్టీఆర్ కి చెప్పాడట. అయితే ఏడు తరాలు… కుటుంబం కోసం దేశ యాత్రలు.. అందులోనూ కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడం.. ఇవన్నీ చెక్ చేసుకుని ఎన్టీఆర్ ఈ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేసాడట. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని మొదట నిర్మించాలి అనుకున్నారు.. కానీ ఎన్టీఆర్ వద్దనేసరికి తప్పుకున్నాడట.

did you notice this mistake in bramhotsavam movie..

 

మరోపక్క దిల్ రాజు కూడా ఓ సందర్భంలో ఈ కథ మీకు అంత కరెక్ట్ కాదు అని కూడా మహేష్ తో చెప్పారట. అయినా మహేష్ అర్ధం చేసుకోలేదు. చివరికి బిగ్ ప్లాప్ ని మూటగట్టుకున్నాడు. మహేష్ ఆ తర్వాత వరుస సినిమాలు చేసాడు కానీ బ్రహ్మోత్సవం సినిమా తో సాలిడ్ దెబ్బ తిన్న శ్రీకాంత్ అడ్డాల నుండి కొత్త సినిమా రావడానికి ఏకంగా 5 ఏళ్ల టైం పట్టింది. అయితే తన అన్ని సినిమాల్లోలాగే ఈ చిత్రం లో కూడా బంధాలు, బంధుత్వాలు చాలా చక్కగా చూపించాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ప్రస్తుతం ఈ చిత్రం లోని ఒక సీన్ లో ఒక మిస్టేక్ ఉంది గమనించారా అంటూ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

did you notice this mistake in bramhotsavam movie..

ఈ మూవీ లో మహేష్ మదర్ రేవతి తన కుమార్తె తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మహేష్ వచ్చి తన సోదరిని సరదాగా ఏడిపిస్తాడు. అయితే ఈ వాళ్ళు వీడియో కాల్ మాట్లాడే సమయంలో కాల్ మ్యూట్ లో ఉంటుంది. దాన్ని గుర్తించిన నెటిజన్లు.. మ్యూట్ లో ఉన్నప్పుడు కాల్ ఎలా మాట్లాడుతున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

watch video :


End of Article

You may also like