గత సంవత్సరం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తప్ప మిగిలిన అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

van mistake in pushpa movie

థియేటర్లో చూసినప్పుడు సినిమాకి సంబంధించిన చాలా పొరపాట్లు మనకి అంత పెద్దగా కనిపించవు. అదే సినిమాని టీవీలో చూసినప్పుడు కానీ, లేదా థియేటర్లలోనే ఒకటి గంటలకు సార్లు చూసినప్పుడు కానీ మనం గమనిస్తూ ఉంటాం. అలా పుష్పకి సంబంధించిన ఒక పొరపాటు కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటంటే, హీరో ఒక సందర్భంలో వ్యాన్ కొనుక్కోవాలి అని అనుకుంటాడు. అందుకోసం హీరో ఫ్రెండ్ అయిన కేశవకి ఈ విషయం చెప్పి వ్యాన్ కొనుక్కురమ్మని చెప్పాడు. కేశవ హీరో చెప్పినట్టే వ్యాన్ కొనుక్కొని వస్తాడు.

van mistake in pushpa movie

అయితే అంతకుముందు కేశవకి వ్యాన్ డోర్ తీయడం రాదు అన్నట్టు చూపిస్తారు. అంటే కేశవకి వ్యాన్ అలవాటు లేదు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ తర్వాత మాత్రం వ్యాన్ డ్రైవ్ చేస్తూ వస్తాడు. కొంత మంది ఈ విషయాన్ని, “పొరపాటు, లాజిక్ మిస్ అయ్యారు” అంటే, ఇంకొంత మంది మాత్రం, “కేశవకి లారీ డ్రైవ్ చేసే అలవాటు ఉంది కాబట్టి వ్యాన్ కూడా అలాగే డ్రైవ్ చేశాడు” అని అంటున్నారు. అసలు ఇది నిజంగా పొరపాటా? లేకపోతే కేశవ కి లారీ డ్రైవింగ్ వచ్చు కాబట్టి వ్యాన్ కూడా డ్రైవ్ చేశాడు అన్నట్టు చూపించారా? అనే విషయం మాత్రం సుకుమార్ కి మాత్రమే తెలియాలి.