అదృష్టం అంటే ఇతనిదే అనుకుంట…ఉద్యోగం పోయింది కానీ 46 కోట్లు వచ్చాయి!

అదృష్టం అంటే ఇతనిదే అనుకుంట…ఉద్యోగం పోయింది కానీ 46 కోట్లు వచ్చాయి!

by Megha Varna

Ads

అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతోంది.దూరదృష్టం తలుపు తీసేదాకా తలుపు కొడుతోంది అని ఒక సామెత కూడా ఉంది.జీవితంలో ఎవరైనాసరే అదృష్టం గురించి ఎదురుచూస్తూ ఉంటారు.ఎంతో ప్రయత్నించాం గాని అదృష్టం కలిసి రాలేదు అనే మాట కూడా మనం చాలాసార్లు వింటూనే ఉంటాం.ఎందుకు అదృష్టం గురించి మనిషి ఎక్కువగా ఎదురుచూస్తాడు అంటే ఒకే ఒక్కసారి అదృష్టం జీవితంలోకి వస్తే ఒక్కసారిగా జీవన విధానమే ఊహించనంతగా మారిపోతుంది.ఇప్పుడు అదృష్ట్రం గురించి చెప్పుకున్నదంతా కూడా మనకి పూర్తిగా ఒక్క విషయంతో అర్ధం కావాలి అంటే తాజాగా న్యూజిలాండ్ లో జరిగిన సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే.వివరాల్లోకి వెళ్తే …

Video Advertisement

representative image

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఎంతోమంది వ్యాపారాలు నష్టపోయారు. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ లో ఓ వ్యక్తి ఉద్యోగం కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్నాడు..ఆ సమయంలో కంప్యూటర్లో ఏదో వెబ్ సైట్ చూస్తూ అనుకోకుండా తాను ఎప్పుడో కొనుకున్న లాటరీ టికెట్ ను చెక్ చేసుకున్నాడు.

అనుకోకుండా అతని లాటిరి టికెట్ మన కరెన్సీలో 46 కోట్లు గెలుచుకొంది.మొదటగా ఆ వ్యక్తి నమ్మలేక ఆశ్చర్యానికి లోనయ్యాడు.తర్వాత మైలాటో సంస్థ కూడా ధ్రువీకరించింది.దీంతో ఆ వ్యక్తి తన భార్యను ఇంటికి పిలిచి జరిగిన విషయాన్నీ చెప్పి సర్ప్రైజ్ చేసారు.మొదటగా ఆ విషయాన్నీ తన భార్య నమ్మలేదు.తర్వాత విషయాన్నీ తెలుసుకున్న ఆమె చాలా ఆనందించింది.వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ మేము ఈ డబ్బు తో మంచి ఇల్లు కొనుకుంటాము ఇంకా కార్ కూడా కొనుకుంటాము.మా పిల్లలను బాగా చదివిస్తాము అని చెప్పారు.జీవితంలో ఒక్కసారి అదృష్టం వరిస్తే జీవితాలు ఇలాగె మారిపోతాయి అని ఈ విషయం గురించి పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like