హీరో పుట్టిన రోజు అని అతను నటించిన పాత బ్లాక్ బస్టర్ మూవీస్ రీ రిలీజ్ చేయడం ఈ మధ్య కొత్తగా ట్రెండ్ లో ఉంది. మామూలుగా పండుగలు అంటే రిలీజ్ అయిన కొత్త సినిమాల సందడి కనిపించేది. కానీ ఈసారి వినాయక చవితికి మాత్రం కొత్త వాటి కన్నా పాత బ్లాక్ బస్టర్ హవానే నడిచింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వేసిన తమ్ముడు, జల్సా ప్రీమియర్లకు కొత్త సినిమాలు షేక్ అయ్యాయి.

Video Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో తిరిగి విడుదల చేయబడింది. చాలా షోలు హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి, మరియు పవన్ అభిమానులు ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాలో పవన్ ఎంట్రీ సీన్, ఫైట్లు, పాటలపై అభిమానులు బ్రహ్మరథం పట్టిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

ఈ రీ రిలీజ్ సినిమాల కోసం ఎప్పుడు ఖాళీగా ఉండే బెంగళూరు తిరుమల థియేటర్ హౌస్ ఫుల్ అవడం, వినాయక చవితి అయినప్పటికీ ఇంట్లో హడావిడిగా పూజలు ముగించుకొని మరి జనాలు సుదర్శన్ 35 ఎంఎంకు పరిగెత్తుకు రావడం అంతా విచిత్రంగా ఉంది అని ప్రస్తుతం టాక్ నడుస్తుంది. గతంలో ఆది, మగధీర, చెన్నకేశవరెడ్డి లాంటి హిట్ సినిమాలు క్రాస్ రోడ్స్ కే పరిమితమైతే ఇప్పుడు రీ రిలీజ్ సినిమాల తాకిడి రెండు తెలుగు రాష్ట్రాలను దాటి ఓవర్సీస్ వరకు చేరుకుంది.

ఈ రకం సినిమాలకు నాంది ఎప్పటినుంచో ఉన్న అవి పూర్తిగా ఊపునందుకుంది మాత్రం ఈ మధ్య రిలీజ్ అయిన ఒక్కడు, పోకిరి సినిమాల తర్వాతే. ఇదే క్రమంలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిల్లా 4K ప్రింట్ ని రీ రిలీజ్ చేశారు. అంతే కాకుండా ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా, అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమా కూడా మళ్లీ రిలీజ్ చేశారు.

దీంతో ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియా అంతా, “మా హీరోల సినిమాలు మళ్లీ విడుదల అవుతున్నాయి. ఈ సారి థియేటర్లలో మామూలుగా ఉండదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ పాపం ఈ రీ రిలీజ్ సినిమాల ప్రభావం ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న కొత్త సినిమాలు మీద భయంకరంగా పడుతుంది. అది మరీ పండగ సెలవులు అయితే ఇంక చెప్పక్కర్లేదు.

audience funny response at thammudu movie theatres

ఉదాహరణకు తమ్ముడు,జల్సా రీ రిలీజ్ లేకపోతే బింబిసార, కార్తికేయ 2, సీతారామంలకు మరింత కలెక్షన్స్ ఉండేవి. ఒక ఐమ్యాక్స్ లో తమ్ముడు, జల్సాలకు కలిపి రెండు రోజుల్లో సుమారు 30 దాక షోలు వేశారు అంటే ఈ రీ రిలీజ్ హవా ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఊహించండి. ఇప్పుడు కూడా కొత్తగా విడుదలైన సినిమాల మీద అందులోనూ ముఖ్యంగా చిన్న సినిమాల మీద ఈ మళ్లీ రిలీజ్ అయిన సినిమాల ప్రభావం పడుతోంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం మీడియం బడ్జెట్ ఉన్న చిన్న చిత్రాల కు చిక్కులు తప్పవు అని విమర్శకుల అభిప్రాయం. మరి ఈ కొత్త మోజు ఎంత కాలం కొనసాగుతుందో వేచి చూడాలి.