Ads
మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, ఇప్పుడు హీరోగా, నిర్మాతగా కూడా మారారు విజయ్ ఆంటోని. విజయ్ అంటోనీ హీరోగా నటించిన లవ్ గురు సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటించారు. ఏప్రిల్ లో విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, అరవింద్ (విజయ్ ఆంటోని) మలేషియాలో ఒక కేఫ్ నడుపుతాడు. 35 సంవత్సరాలు అయినా కూడా పెళ్లి చేసుకోడు. తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ లీల (మృణాళిని రవి) ని చూస్తాడు. లీల తన ఇంట్లో ఐటీ జాబ్ చేస్తున్నాను అని చెప్పి సిటీకి వెళ్తుంది. కానీ హీరోయిన్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.
Video Advertisement
ఇక్కడ అరవింద్ లీలని చూసి ఇష్టపడతాడు. లీల తండ్రికి లీల హీరోయిన్ గా ప్రయత్నిస్తోంది అనే విషయం తెలిసిపోతుంది. దాంతో అరవింద్ ని లీలకి ఇచ్చి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ తర్వాత అరవింద్ కి లీల తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది అని తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. పెళ్లి అనేది అమ్మాయిల కలలు నెరవేర్చుకోవడానికి అడ్డంకే కాదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు. హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన రబ్ నే బనాదీ జోడీ ఇదే స్టోరీ మీద వచ్చింది. ఈ సినిమా చూస్తుంటే చాలా చోట్ల అదే సినిమా గుర్తొస్తుంది.
కానీ సిస్టర్ సెంటిమెంట్ యాడ్ చేసి ఈ సినిమాని కొత్తగా చూపించారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, విజయ్ ఆంటోని తన పాత్రలో చాలా బాగా నటించారు. సినిమాలో విజయ్ ఆంటోనికి సమానంగా మృణాళిని రవి పాత్ర ఉంటుంది. ఆమె కూడా చాలా బాగా నటించారు. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేశారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, భరత్ ధన శేఖర్ సంగీతం అందించారు. మీరా విజయ్ ఆంటోని, విజయ్ ఆంటోని, సాండ్రా జాన్సన్, నవీన్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. తెలిసిన కథ అయినా కూడా మంచి టేకింగ్ తో ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా లవ్ గురు సినిమా నిలుస్తుంది.
End of Article