OTT లోకి వచ్చిన వైష్ణవి చైతన్య కొత్త సినిమా..! ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

OTT లోకి వచ్చిన వైష్ణవి చైతన్య కొత్త సినిమా..! ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

by Mohana Priya

Ads

గత సంవత్సరం వచ్చిన బేబీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ వైష్ణవి చైతన్య. వైష్ణవి చైతన్య ఇటీవల నటించిన సినిమా లవ్ మీ ఇఫ్ యు డేర్. ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటించారు. అరుణ్ భీమవరపు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, అర్జున్ (ఆశిష్) ఒక మామూలు అబ్బాయి. ఎవరు ఏ పని అయితే చెయ్యొద్దు అని అంటారో అదే పని అర్జున్ చేయాలి అని అనుకుంటాడు.

Video Advertisement

love me if you dare amazon prime

అర్జున్ ని ప్రియ (వైష్ణవి చైతన్య) ప్రేమిస్తుంది. ఒకసారి అర్జున్ రామచంద్రాపురంలో ఉండే ఒక బంగళాలో ఉండే దివ్యవతి అనే ఒక ఆత్మని ఇష్టపడతాడు. ఆ ఆత్మని ప్రేమించే క్రమంలో ఇంకా కొంత మంది ఆత్మలతో అర్జున్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు దివ్యవతి ఎవరు? ఆమె ఆత్మగా ఎలా మారింది? అర్జున్ దివ్యవతిని ఎందుకు ప్రేమించాడు? ప్రియ ఏం చేసింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

సినిమా కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దెయ్యాన్ని ప్రేమించడం అనేది కొత్తగా అనిపిస్తుంది. కానీ టేకింగ్ విషయంలో మాత్రం పొరపాట్లు జరిగాయి అనిపిస్తుంది. పాత్రలు రాసుకునే విధానం ప్రాపర్ గా అనిపించదు. సినిమాకి చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు. ఫస్ట్ హాఫ్ కొన్ని మంచి విజువల్స్ వల్ల బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో కథ బాగుంటే సినిమా ఇంకొక రకంగా ఉండేది. కానీ ఇక్కడ అలా లేదు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఆశిష్ మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. తన పాత్రలో తను చాలా బాగా నటించారు. అంతకంటే ఎక్కువ కూడా నటించే అంత స్కోప్ లేదు. పాత్రకి ఎంత కావాలో అంత ఇచ్చారు.

మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మాత్రం అన్ని విషయాల్లో చాలా బాగా మెరుగుపడ్డారు అనిపిస్తుంది. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. హీరోయిన్ వైష్ణవి చైతన్య కి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కాదు. తన పాత్ర పరిధి మేరకు నటించారు. సినిమాకి మరొక హైలైట్ అయ్యారు సిమ్రాన్ చౌదరి. చాలా బాగా నటించారు. రవి కృష్ణ కూడా తన పాత్రకి తగ్గట్టు నటించారు. ఎం ఎం కీరవాణి అందించిన పాటలు అంత పెద్ద గొప్పగా అనిపించవు. అలా ఫ్లోలో వెళ్లిపోతాయి.

సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ. ఒకరకంగా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ అంత బాగా రావడానికి కారణం సినిమాటోగ్రఫీ. సెకండ్ హాఫ్ లో కూడా సినిమాని సేవ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ కథలో ఇంకా బలంగా ఉంటే విజువల్స్ ఇంకా బాగా కనిపించేవి. నిర్మాణ విలువలు కూడా సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉంటుంది అని సినిమా చివరిలో చెప్తారు. ఆ సినిమాకు ఎప్పుడు వస్తుంది అనేది తెలియాలి అంటే ఆ సినిమా ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.


End of Article

You may also like