బాలీవుడ్ ఇండస్ట్రీలో అన్యోన్యంగా ఉండే జంట బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ , గౌరీఖాన్. వీరిది ప్రేమ వివాహం అనే అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు అంత సులభంగా వెళ్లలేదు. ఎందుకంటే గౌరీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దాంతో పెళ్లి సమయంలో షారుఖ్ ఖాన్ కు పేరు మర్చినట్లు గౌరీ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
Video Advertisement
గౌరి వారి పై తీవ్రంగా ఒత్తిడికి తీసుకురావడంతో చివరకు ఆమె తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించారని తెలిపారు. వివాహ సమయానికి షారూఖ్ వయసు 26, గౌరీ వయసు 21 సంవత్సరాలు. అంతే కాదు ఈ జంట 3 సార్లు వివాహం చేసుకున్నారట. ఢిల్లీలో షారుఖ్ ఖాన్ కాలేజీలో రోజుల్లోనే గౌరీతో పరిచయం ఏర్పడిందట. ఆ తరువాత ప్రేమగా మారిందని, ముందుగా తానే గౌరీని ప్రేమించానని షారుఖ్ చాలాసార్లు చెప్పాడు. పెళ్లికి ముందు ఈ జంట 6 ఏళ్లు ప్రేమాయణం సాగించారు.
షారుఖ్ ఖాన్ నటన పై ఉన్న ఆసక్తితో సినిమాలలో ప్రయత్నిస్తూనే, టెలివిజన్ లో వచ్చిన ఛాన్స్ సద్వినియోగం చేసుకున్నాడు. డిడిలో టెలికాస్ట్ అయిన సర్కస్ సీరియల్ లో నటించి, ఎంతో పాపులర్ అయ్యాడు. ఆ తరువాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి దీవానా, బాజీగర్, డర్, కుచ్ కుచ్ హోతాహై లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి బాలీవుడ్ బాద్షాగా షారుఖ్ ఖాన్ ఎదిగాడు. ఆ సమయంలో షారుఖ్ కు ఆయన భార్య గౌరీ ఆర్ధికంగా తోడ్పడుతూ అండగా నిలబడిందని షారుఖ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
బాలీవుడ్ లో తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గౌరీ ఇచ్చిన ప్రోత్సాహమే అని కింగ్ ఖాన్ చెప్పాడు. ఈ అందమైన జంట లవ్ స్టోరి సినిమాకి తక్కువ కాదని చెప్పవచ్చు. షారుఖ్ ముస్లిం, గౌరీ పంజాబీ హిందూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వీరి ప్రేమను గౌరి ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అందువల్ల పెళ్లి సమయంలో షారూఖ్ పేరుని హిందువుగా అనుకునేలా అభినవ్ అనే పేరును పెట్టానని గౌరీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: “హౌజ్ కీపింగ్” నుండి నటిగా మారిన ”త్రినయని” సీరియల్ తిలోత్తమ స్టోరీ..! ఈమె కథ వింటే హాట్సాఫ్ అనాల్సిందే..!