దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవల తమిళంలో విడుదలైన ‘లవ్ టుడే’ తో విజయం సాధించాడు. ప్రేక్ష‌కులు రొటీన్ సినిమాల‌ను దూరం పెట్టేస్తున్నారు. కంటెంట్ బావుంటే చాలు, హీరోతో ఎవరు అని చూడకుండా సినిమాను ప్రేక్ష‌కులు హిట్ చేస్తున్నారు.

Video Advertisement

అలా ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్ర‌మే ‘లవ్ టుడే’. ఇప్పటి యువ‌త సెల్ ఫోన్స్ మీద ఎలా ఆధార‌ప‌డుతున్నారు. ఎలా అడిక్ట్ అయిపోతున్నారు. ఒకవేళ ఒక‌రి సెల్ ఫోన్స్‌లో సీక్రెట్స్ మ‌రొక‌రి తెలిసినపుడు ఎలాంటి గొడ‌వ‌లు వ‌స్తాయి అనే కాన్సెప్ట్ తో తీశారు.అంతేకాకుండా ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీలో హీరోగా అరంగేట్రం కూడా చేశాడు. ఇదే మూవీ ఈరోజు తెలుగులో విడుదలైంది.

love-today-2022-telugu adda

ప్రదీప్ రంగనాథన్ ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ తీసాడు. వాటిలో ఒకటి అప్పా లాక్, ఈ షార్ట్ ఫిల్మ్స్ ఆధారంగానే లవ్ టుడే సినిమాని తీశాడు. అయితే అప్పట్లో అంటే ఎనిమిది సంవత్సరాలకు ముందు తాను తీసిన షార్ట్ ఫిల్మ్ ను చూడాల్సిందిగా నటుడు ప్రేమ్ జీ అమరన్ ని అడిగాడు.

అయితే అతను ఆ ట్వీట్ కి అప్పడు సమాధానం ఇవ్వలేదు. ‘లవ్ టుడే’ విడుదలై విజయం పొందిన తరువాత సమాధానం ఇచ్చాడు. అయితే దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌కి, ప్రేమ్ జీ అమరన్ ఎనిమిదేళ్లు ఆలస్యంగా ఇచ్చిన సమాధానం వైరల్‌ అవుతోంది.

అంతేకాకుండా దర్శకుడి గురించి మరింత తెలుసుకోవడానికి నెటిజన్లు ప్రదీప్ రంగనాథన్ పాత సోషల్ మీడియా పోస్ట్‌లను చూస్తున్నారు. సినిమాపై అతనికున్న ప్రేమ గురించి తెలుసుకుంటున్నారు.  ప్రదీప్ రంగనాథన్ ట్వీట్లలో సినీ తారలను దర్శకత్వం చేసే అవకాశం కోసం అభ్యర్దించారు. ఇప్పుడా పాత ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

 

ఇక ‘లవ్ టుడే’ని ప్ర‌దీప్ రంగ‌నాథన్ ఐదేళ్లు ముందు రాసుకున్న అప్పా లాక్ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తీశారు. నేటి కాలం యువ‌త సెల్ ఫోన్స్ కి ఎలా అడిక్ట్ అయిపోతున్నారు. ప్రేమికులకి ఒక‌రి సెల్ ఫోన్స్‌లో సీక్రెట్స్ మ‌రొక‌రి తెలిస్తే ఎలాంటి గొడ‌వ‌లు వ‌స్తాయి అనేదాన్ని కామెడీ కోణంలో చూపించారు.

pradeep ranganathan posts asking celebrities to watch his short films

ఎవ‌రైనా మ‌న నుండి ఒక విష‌యాన్ని దాచి పెడుతున్నారంటే వాళ్లు త‌ప్పు చేసినట్టు కాదని చక్కగా చూపించారు. ఈ సినిమాకి సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అందించారు.