అప్పట్లో టాప్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఈశ్వరి. ఈమె ఐటమ్ సాంగ్స్ పాడుతూ అందరినీ మత్తెక్కించేసేవారు. చాలా మందికి ఎల్ ఆర్ ఈశ్వరి గురించి తెలుసు కొత్తగా ఆమె గురించి పరిచయం చేయక్కర్లేదు. ఆమె చాలా పాటలు పాడారు. మాయదారి చిన్నోడు మనసే లాగేసిండు.. భలే భలే మగాడివో బంగారు నా సామివోయ్.. మసక మసక చీకటిలో మల్లె తోట్ల వెనకాల ఇలా చాలా పాటలు పాడారు పైగా ఈమె పాటలకి చక్కటి గుర్తింపుని కూడా తెచ్చుకున్నారు.

Video Advertisement

తాజాగా ఈమె పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ అయినా ‘ఊ అంటావా మామ’ పాట గురించి కామెంట్లు చేశారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

టాప్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఈశ్వరీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఎక్కువగా ఆమె ఐటమ్ సాంగ్స్ ని పాడేవారు. హుషారుగా తాను పాటలు పాడేదని అందుకే దర్శకుడు ఐటమ్ సాంగ్స్ ని ఇచ్చే వారిని ఆమె చెప్పారు. పైగా ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని.. కానీ అందులో ఆమె పాడిన పాటలు ఎవరు పాడడం లేదని అన్నారు. పైగా దానికి కారణం కూడా తనకు తెలియదని చెప్పారు.యాంకర్ ఆమెతో ఊ అంటావా మామ పాటని పాటించారు. ఈ పాట పై తన అభిప్రాయాన్ని చెప్పమంటే… ఆమె అన్ని లైన్స్ ఈ పాటలో ఒకేలా ఉంటాయి. ఇది కూడా పాటేనా అని ఆమె అన్నారు.

పైగా పై నుండి కింద వరకు ఒకేలా పాట ఉంటుందని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ మధ్య కాలంలో వస్తున్న పాటలు ఏమీ తనకి ఎక్కువగా నచ్చడం లేదని… ఇదివరకు వర్క్ చాలా సిన్సియర్ గా ఉండేదని అందుకే అప్పుడు పాడిన పాటలు ఇప్పటికి కూడా నిలబడ్డాయని ఆమె అన్నారు. పైగా ఒక్కో సినిమా అప్పట్లో 150 నుండి 250 రోజులు ఆడేవని ఇప్పుడు ఓ పది రోజులు ఆడితే అది పెద్ద గొప్ప అని అంటున్నారు. పైగా అప్పట్లో గాయకులు పాడిన పాటలు ఉన్న సినిమా సక్సెస్ అయితే వాళ్లకి కూడా అవార్డులు ఇచ్చే వాళ్ళని ఈశ్వరి చెప్పుకొచ్చారు.