ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా భారీ అంచనాల నడుమ మే 12వ తేదీన థియేటర్లలోకి రానుంది. దీనిపై ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు అత్యంత కీలకమైన చిత్రం అని చెప్పవచ్చు.

Video Advertisement

అయితే ఈ సినిమాలోని ఒక మాస్ సాంగ్ మామ మహేష్ మే 7వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ పాటకు తమన్ సంగీతాన్ని సమకూర్చారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అయితే ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతోంది. మ మ మహేష్ సాంగ్ చాలా బాగుంది కానీ ఆ ట్యూన్ కాపీ కొట్టారని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

watch video:

“బ్లాక్ బస్టర్ సాంగ్ కొట్టమంటే సరైనోడు సినిమా లోని బ్లాక్ బస్టర్ సాంగ్ నే” మళ్లీ కొట్టావా తమనన్నా అంటూ నెటిజన్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే టాపిక్ నడుస్తోంది. కొంతమందేమో ఒక చిన్న ట్యూన్ మాత్రమే బ్లాక్ బస్టర్ సాంగ్ ట్యూన్ లా ఉందని మిగతాదంతా బాగానే ఉందంటూ కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఇది కాస్త ఇబ్బంది పెట్టే విషయమే అని చెప్పవచ్చు.

watch video: