Ads
నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి, తర్వాత ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటి మాధవి లత. గత కొన్ని సంవత్సరాల నుండి మాధవి లత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
Video Advertisement
ఎన్నో విషయాలు పై స్పందిస్తూ తన అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రష్మిక సంఘటన మీద కూడా మాధవి లత మాట్లాడి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే మాధవి లత చేసిన ఒక కామెంట్ వేరే విధంగా అర్థం అయ్యి సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యింది అని మాధవి లత పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే, మాధవి లత ఒక సందర్భంలో చెబుతూ, “గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే మాటలు చెప్పడం కాదు. పాటించాలి” అని అర్థం వచ్చేలాగా ఒక మాట అన్నారు. ఇవల బాలకృష్ణ కూడా తన సినిమాలో ఈ విషయానికి సంబంధించి మాట్లాడారు. దాంతో చాలా మంది మాధవి లత బాలకృష్ణని ఉద్దేశించి ఇలా అన్నారు అని అన్నారు. ఈ విషయంపై వివరణ ఇస్తూ మాధవి లత సోషల్ మీడియాలో ఈ విధంగా రాశారు. “నిన్న నుండి సర్కులేట్ అవుతోంది.”
“నేను బాలకృష్ణ అనే నేమ్ నా గొంతు నుండి వస్తే ప్రూవ్ చేయండి? నేను మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాను. చెప్పే ముందు పాటించండి. ప్రతి మగ ఎదవకి చెప్తున్నా. ప్రతి ఆడ కుక్కకి చెప్తున్నా. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించండి. చేసే వాళ్లు మాట్లాడటం మానేయండి. చేసేది శివ పూజలు. దూరేది. ఇప్పుడు మీకు ఏం తిట్టాలని అనిపించినా తిట్టండి. అది మీకు ఆనందం. ఎందుకంటే ఎలాగైనా మీరు నిరూపించేది ఏమీ లేదు. మీ విపరీతమైన ఆలోచనలతో మీరు సంతోషంగా ఉండండి. నాకు ఏం ఫరక్ పడదు.”
“నన్ను మహా అయితే అమ్మనా బూతులు తిడతారు. సంతోషంగా ఉండండి. ఎవరైతే ఆ పదం అంటారో. వాళ్లు అలాగే పుట్టారు. అని రాశారు. అంతే కాకుండా ఈ విషయంపై ఇంకా మాట్లాడుతూ, “నన్ను ఇష్ట పడని వాళ్లకి చెప్తున్నాను, సీతమ్మ చూపించిన గడ్డి పరక తెలుసా? అది మీరు. రావణ జాతికి నేను చెప్పేది అదే. గడ్డి పరక. థాంక్యూ. మీరు నన్ను ఎంత ట్రోల్ చేసినా, ఎంత తిట్టినా, నా చేతిలో గడ్డి పరకలు రావణులు గింజుకున్నా రాములు కాలేరు. ఇది చరిత్ర” అని మాధవి లత రాశారు.
ALSO READ : రూట్ మార్చిన కాంగ్రెస్..! BRS మీద చేసిన ఈ అడ్వటైజ్మెంట్ చూశారా..?
End of Article