ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి పార్టీ తమని తాము ప్రచారం చేసుకోవడంలో మునిగి ఉంది. నాయకులు అందరూ కూడా ఎన్నికల ప్రచారాల్లో జోరుగా పాల్గొంటున్నారు. తమ పార్టీని ప్రచారం చేయడానికి విభిన్న మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు.

Video Advertisement

హలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా తమదైన రీతిలో ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ విడుదల చేసింది. ఈ అడ్వర్టైజ్మెంట్ ని పరిశీలించి చూస్తే, ఇందులో ఒక గులాబీ రంగు కారు పొలాల మీదుగా వెళుతూ కొంత మంది వ్యక్తుల మీద బురద జల్లుతుంది.

telangana congress advertisement

దాంతో రైతులకు ఎలాంటి నష్టాలు వచ్చాయి అనేది ఒక లైన్ లో ఇచ్చారు. ఆ తర్వాత అదే కారు ముందుకు వెళుతూ కాలేశ్వరం గురించి కూడా చెబుతున్నట్టుగా, ఆ తర్వాత కార్ ముందుకి వెళ్తూ చాలా మంది మీద బురదలు జల్లుతూ ఉన్నట్టు చూపించారు. నిరుద్యోగంలో నంబర్ వన్ అని, పుట్టే ప్రతి బిడ్డ మీద లక్షన్నర అప్పు అని, పెరిగిన ధరలతో సామాన్యుడి బతుకు ఆగం అని ఇలా చూపించారు.

telangana congress advertisement

కారులో నుండి ఒక వ్యక్తి దిగి మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి చూడడానికి కూడా కాస్త BRS నాయకుడి లాగానే ఉన్నారు. ఆ గులాబీ రంగు కారులో ఆ నాయకులు ఎక్కడికి వెళ్తే అక్కడ కార్ ఆగిపోయినట్టు, కార్ టైర్ లో గాలి పోయినట్టు, దాంతో కారు వెనక్కి తోసుకుంటూ వెళ్ళినట్టు అడ్వర్టైజ్మెంట్స్ డిజైన్ చేశారు. ఒకటే అర్థంతో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఒక మూడు, నాలుగు యాడ్స్ ఇదే విధంగా రూపొందించి విడుదల చేశారు.

telangana congress advertisement

“పదేళ్ల అహంకారం పోవాలి. పదేళ్ల విధ్వంసం పోవాలి” అంటూ ఈ ఎడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా BRS పార్టీ నేతలు లాగానే ఉన్నారు. ఇలా ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. మరొక పక్క నాయకులు కూడా ప్రతి ప్రాంతంలో తిరిగి, తమ పార్టీకి ఓటు వేయండి అని, తమ పార్టీ నాయకత్వంలోకి వస్తే ఎలాంటి మార్పులు వస్తాయి అనేది చెప్తూ ప్రచారం చేస్తున్నారు.

watch video :

ALSO READ : “అసలు నీది ఏ పార్టీ..? చెప్పు పవన్ కళ్యాణ్..!” అంటూ… “నారాయణస్వామి” కామెంట్స్..! ఏం అన్నారంటే..?