Home Politics “అసలు నీది ఏ పార్టీ..? చెప్పు పవన్ కళ్యాణ్..!” అంటూ… “నారాయణస్వామి” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“అసలు నీది ఏ పార్టీ..? చెప్పు పవన్ కళ్యాణ్..!” అంటూ… “నారాయణస్వామి” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by Sainath Gopi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన రామ రాజ్యం లాగా కొనసాగుతుందని,అందుకనే రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆయననే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన హాట్ కామెంట్స్ చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జనసేన నిలబడే స్థానాలను పవన్ కళ్యాణ్ ప్రకటించి అభ్యర్థులకు బీఫాంలు అందించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పైన తెలంగాణలో బిఆర్ఎస్ నాయకులు, ఆంధ్రాలో వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా ఈ జాబితాలో చేరారు.తెలంగాణలో బిజెపికి మద్దతు పవన్ కళ్యాణ్ ఏపీలోనేమో టిడిపి తో పొత్తు పెట్టుకున్నారు. అసలు నీ పార్టీ ఏంటి? ఈ నాటకాలన్నీ ఎందుకు? అంటూ పవన్ కళ్యాణ్ పైన మండిపడ్డారు. సినిమాలో నటించే పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్, చిరంజీవి మాదిరిలాగా రాజకీయాల్లోకి రాలేదని, తెలంగాణలో ఒక సీటు కూడా గెలవలేదు కాని, బిజెపితో పొత్తు ఏపీలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడని అలాంటి మోసగాళ్ళను నమ్మొద్దని ప్రజలకు తెలిపారు.

deputy cm
సీఎం జగన్ పాలన రామరాజ్యమని, చంద్రబాబు రాక్షస రాజ్యం అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తో ఒకపక్క చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని, బిజెపితో ఈ దత్త పుత్రుడు మరోపక్క పొత్తు పెట్టుకున్నారని, అసలు ఎవరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు, ఎవరితో కలిసి వెళ్తున్నారని మీకైనా తెలుసా అంటూ ప్రశ్నించారు.కాగా తెలంగాణ ఎన్నికల పైన పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. జనసేన అభ్యర్థులు నిలబడిన ప్రతి చోట పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని చెబుతున్నారు. మొన్న మోడీ నిర్వహించిన బీసీ గర్జన సభలో పవన్ కళ్యాణ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

 

Also Read:1987 నాటి “గోధుమ పిండి” బిల్ చూశారా..? అప్పట్లో ఎంత ధరకి అమ్మేవారు అంటే..?

You may also like