Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా పుష్ప సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Video Advertisement
ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్ అంచనాలు పెంచేసాయి. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి విడుదల అయినా “ఊ అంటావా.. ఊహు అంటావా మావా” సాంగ్ సెన్సషనల్ న్యూస్ గా మారింది. ఈ పాట కుర్రకారుని ఓ ఊపు ఊపేస్తోంది. మరోవైపు.. ఈ పాట పురుషుల్ని అవమానించేలా ఉంది అంటూ..పురుషుల సంఘం కేసు కూడా పెట్టింది.
ఇది ఇలా ఉంటె ఈ ఇష్యూ పై తాజాగా మాధవీలత స్పందించారు. ఈ విషయమై ఫేస్ బుక్ లో ఆమె పోస్ట్ చేసారు.. పురుషుల సంఘం కేసు పెట్టారటగా.. ఇలా అయితే సినిమాల్లో వచ్చే 98 % సాంగ్స్ పైన కేస్ పెట్టాల్సి వస్తుంది. అసలు పాటలే లేని సినిమాలు చెయ్యాలి. నేను కూడా సామి సామి సాంగ్ పై కేసు పెట్టేస్తా.. ఎక్కడైనా అమ్మాయిలకి మగాడిని చూసిన.. పోల్చినా చులకనగా వెళ్ళిపోతుందా..? అబ్బాయి నడిస్తే.. ఆ ప్లేస్ లో భూమిని టచ్ చేసి మొక్కుతుందా..? అంటూ ప్రశ్నించారు. ఈ పాటపై నేను కూడా కేసు వేస్తా అని.. తగ్గేదేలే.. అని తన పోస్ట్ లో పేర్కొన్నారు.
End of Article