Ads
తమిళనాడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషలా వివాదం అందరికీ తెలిసిందే. మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన కామెంట్లను చాలామంది తెలుగు తమిళ నటులు ఖండించారు. అయితే త్రిషాకి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరోయిన్ ఖుష్బూలు ముందుకు వచ్చి బహిరంగంగానే ఈ విషయంపై మాట్లాడారు.
Video Advertisement
అయితే చిరంజీవి పూర్తి విషయం తెలుసుకోకుండా తన పైన కామెంట్లు చేయడం తన పరువుకు నష్టం కలిగిందని మన్సూర్ అలీ ఖాన్ చిరంజీవితో పాటు త్రిష, ఖుష్బూలపై హైకోర్టులో పరువు నష్టం దావా వేశాడు. తనకి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. తాజాగా ఈ కేసు పైన విచారణ జరిపిన న్యాయస్థానం మన్సూర్ అలీఖాన్ కి మొట్టికాయలు వేసింది.
పబ్లిక్ ప్లాట్ ఫామ్ నందు త్రిష పైన హీనమైన కామెంట్లు చేసినందుకు ఆమె మీ పైన తిరిగి కేసు పెట్టాలి… మీకు వివాదాల్లో తల దూర్చడం అలవాటు ఉంది.ప్రతిసారి అలా చేయడం ఆ తర్వాత వచ్చి అమాయకుడిని చెప్పడం మీకు అలవాటైపోయిందని మొట్టికాయలు వేస్తూ తీర్పు వెల్లడించింది.
న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల తెలుగు, తమిళ ఇండస్ట్రీలు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మన్సూర్ అలీఖాన్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ఆకాశం మీదకి రాయి వేస్తే అది తిరిగి మన మీదకే వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
End of Article