కోలీవుడ్లో ప్రస్తుతం మంచి సక్సెస్ఫుల్ నిర్మాతల్లో ఒకరు రవీందర్ చంద్రశేఖరన్. నిర్మాతగా బాగా ఉన్న రవీందర్ పై తనని వ్యాపారంలో మోసం చేశారు అని ఒకతను పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వ్యాపారంలో భాగంగా తన దగ్గర కోట్ల రూపాయల డబ్బు తీసుకొని చెల్లించకుండా మోసం చేస్తున్నారు అనేది అతని వాదన. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్మాత రవీందర్ ను అదుపులోకి కూడా తీసుకున్నారు.

Video Advertisement

ఈ నేపథ్యంలో అతని భార్య మహాలక్ష్మి.. భర్త జైలుకు వెళ్లినందుకు ఎటువంటి బాధ లేకుండా.. అతని బయటకు తీసుకురావాలి అన్న ప్రయత్నం కూడా చేయకుండా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండడంతో పాటు ఫోటోలు షేర్ చేయడం పై ఒక అభిమాని ఫైర్ అయ్యాడు. భర్త జైల్లో ఉంటే ఇంత సంతోషంగా ఉన్నాం అసలు నిజంగా నువ్వు అతని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేకపోతే అందరూ అన్నట్టు డబ్బు చూసి చేసుకున్నావా అని భారీగా విమర్శిస్తూ ట్రోల్ చేశాడు.

మహాలక్ష్మి రవీందర్ ను రెండవ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళ పెళ్లయిన కొత్తలో మహాలక్ష్మి కేవలం డబ్బు కోసమే రవీందర్ ను చేసుకుంది అని వీళ్ళిద్దరిపై విపరీతంగా ట్రోలింగ్ చేశారు. అయితే అప్పట్లో ఇద్దరు కలిసి ఈ విషయాన్ని ఖండించారు కూడా. ఇప్పుడు ఈ సందర్భంలో తిరిగి ఆ విషయాన్ని మరొకసారి నిటిజన్ లు గుర్తు చేస్తున్నారు. అయితే భర్త జైల్లో ఉన్నందుకు ఒత్తిడికి గురి అయిన మహాలక్ష్మి.. అతను చేసిన మోసం గురించి సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట.

పెళ్లికి ముందు అతను ఇలాంటి మోసాలు చేస్తాడు అన్న విషయం ఆమెకు తెలియదట. మభ్యపెట్టి తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని ఆమె బాధపడడం జరిగిందంట. ఇప్పటికే విడాకులు తీసుకొని ఒక కొడుకుతో ఒంటరిగా ఉంటున్న ఆమె…. జీవితంపై నమ్మకాన్ని కలిగించాడు కాబట్టి రవీందర్ ను రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు అతను జైలు పాలు అవ్వడంతో మరొకసారి వత్తిరికి గురి అవుతున్నట్టు ఆమె వాపోతోంది. అయితే ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.