వీధులు శుభ్రం చేయించి… “రోల్స్ రాయిస్” కంపెనీ మీద పగ తీర్చుకున్న ఈ భారతీయ రాజు ఎవరో తెలుసా.?

వీధులు శుభ్రం చేయించి… “రోల్స్ రాయిస్” కంపెనీ మీద పగ తీర్చుకున్న ఈ భారతీయ రాజు ఎవరో తెలుసా.?

by Anudeep

Ads

మొదటి ప్రపంచ యుద్ధానికి (1914-1918) ముందు రోల్స్ రాయిస్ కంపెనీ 20 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేస్తే.. అందులో 20% ఇండియాకే దిగుమతి చేయబడింది అని మనలో చాలా మందికి తెలీదు.

Video Advertisement

ఆ కాలంలో ఇండియాలో 230 మంది మహారాజులు ఉన్నారు. దేశంలో సగటున 2000 రోల్స్ రాయిస్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఇండియన్ కింగ్స్ కి రోల్స్ రాయిస్ కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉండేది. రాజస్థాన్‌లోని అల్వార్ కు చెందిన ప్రముఖ మహారాజు “జై సింగ్” ఒకేసారి మూడు ఆటోమొబైల్స్ కొనుగోలు చేసేవాడు.

1920లో ఆల్వార్ మహారాజా జై సింగ్ లండన్‌లోని మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నాడు. అతను సాధారణ వస్త్రధారణలో ఉండి రోల్స్ రాయిస్ షోరూమ్‌లోకి ప్రవేశించాడు. అప్పుడు ఒక బ్రిటీష్ సేల్స్‌మాన్ మహారాజా జై సింగ్‌ను చూసి చూడనట్టు వ్యవహరించాడు. ఎందుకంటే అతను కేవలం ఒక సాధారణ పేద భారతీయుడు అని.

కింగ్ జై సింగ్ ఈ అవమానాన్ని భరించలేక వెంటనే తన హోటల్ గదికి తిరిగి వచ్చాడు. అప్పుడు అతను తన సేవకులతో  షోరూమ్‌కి కాల్ చేయించి, అల్వార్ నగర రాజు వారి కార్లలో కొన్నింటిని కొనుగోలు చేయబోతున్నాడని చెప్పించాడు. ఆ తర్వాత రాజు దర్శనాన్ని పురస్కరించుకుని షోరూమ్‌లోని సేల్స్‌మెన్స్ అందరూ బారులు తీరి షోరూమ్‌లో రెడ్ కార్పెట్ పరిచారు.

అప్పుడు రాజు తన రాజ రూపంలో షోరూమ్‌ని సందర్శించాడు. ఆ సమయంలో షోరూమ్‌లో ఆరు కార్లు ఉన్నాయి. రాజు ఒకేసారి ఆరు కార్లను కొనుగోలు చేశాడు. డెలివరీ ఛార్జీలతో సహా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు.

ఆరు రోల్స్ రాయిస్ భారతదేశానికి దిగుమతి చేసాక, నగరంలోని వీధులను ఊడ్చేందుకు ఈ కార్లను ఉపయోగించాలని రాజు మున్సిపాలిటీని ఆదేశించాడు. కొద్దిసేపటికే ఈ వార్త ప్రపంచం అంత వ్యాపించింది. వరల్డ్ నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ షాక్‌ అయ్యింది.
దీంతో ఆ కంపనీ గుడ్ విల్ మరియు ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. చివరకు.. రోల్స్ రాయిస్ వారి ప్రవర్తనకు క్షమాపణలు చెబుతూ భారత రాజు జై సింగ్‌కు టెలిగ్రామ్ పంపింది. అంతేకాదు.. మరో ఆరు సరికొత్త కార్లను కూడా ఉచితంగా అందించింది.  చెత్తను సేకరించడానికి రోల్స్ రాయిస్‌ను ఉపయోగించడం మానేయాలని రాజు మున్సిపాలిటీని కోరాడు. అలాగే కంపనీ క్షమాపణలను కూడా అంగీకరించాడు.

ఈ కథ చదివాక “ఇండియన్ కింగ్ దెబ్బ.. రోల్స్ రాయిస్ అబ్బా..” అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.


End of Article

You may also like