ఇండియన్ సినిమా హిస్టరీ గురించి అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని అనొచ్చు. అంతకు ముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే గుర్తొచ్చేది. కానీ బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

baby tanvi bahubali

అంతే కాకుండా అంతకు ముందు వరకు పాన్ ఇండియా సినిమా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవి. కానీ బాహుబలి తర్వాత ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. ఒకరకంగా చెప్పాలి అంటే తమ కంటెంట్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్ చేయాలి అనుకునే ఫిలిం మేకర్స్ కి బాహుబలి ఒక ధైర్యం ఇచ్చింది.

బాహుబలి సినిమాలో ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ ఎంతో బాగా డిజైన్ చేశారు. అన్నిట్లో చాలా డీటెయిలింగ్ ఉంటుంది. ఇందులో కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులకి ఇప్పటికీ గుర్తు ఉంటాయి. బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎత్తుకొని ఉండే షాట్ మీరు చూసే ఉంటారు.

baby tanvi bahubali

baby tanvi bahubali

సినిమా విడుదల టైంలో పోస్టర్స్ లో కూడా ఎన్నో చోట్ల ఈ షాట్ వాడారు. అయితే నిజానికి ఆ సీన్ లో ఉన్నది బాబు కాదు. ఆ అమ్మాయి పేరు తన్వి. తను ఇప్పుడు ఇలా ఉంది. తన్వి ఇటీవల టీవీ9 కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తన్వి ప్రజెంట్ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

watch video :