మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు. ఆఖరుగా సర్కారు వారి పాట సినిమా చేసారు మహేష్ బాబు. త్రివిక్రమ్, మహేష్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా అందర్నీ ఆకట్టుకునేలాగే కనపడుతోంది.

Video Advertisement

హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించనున్నారు. షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన పూజ హెగ్డే నటించనున్నారు.

interesting update about mahesh- trivikrm movie..!!

ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అతని భార్య నమ్రత ఓ బిజినెస్ ని ఓపెన్ చేసారు. ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియా లో షికార్లు కొడుతున్నాయి. ఏషియన్ గ్రూప్‌ తో కలిసి హైదరాబాదులో ఓ రెస్టారెంట్ ని స్టార్ట్ చేసారు. ఏఎన్ అని పేరు పెట్టారు. ఏ అంటే ఏషియన్స్ అని అర్ధం. ఇక ఎన్ అంటే నమ్రత. ఈ రెస్టారెంట్ బంజారా హిల్స్‌ లోని టీఆర్ఎస్ భవనం దగ్గర వుంది ఏఎన్ రెస్టారెంట్. ఇలా సినిమాలే కాకుండా మహేష్ వ్యాపార రంగం లోను ముందే వున్నారు. థియేటర్స్, క్లాతింగ్ కి సంబంధించి వ్యాపారాలను కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఏఎన్ స్టార్ట్ చేసారు.

ఇదిలా ఉంటే ఆర్ఆర్ సినిమా తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి తో సూపర్ స్టార్ ఓ సినిమాలో నటించినున్నారు. 2024 సమ్మర్ కి ఈ సినిమా వస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా రాబోతోంది. మహేష్ ప్రపంచం లోనే చాలా ప్రాంతాలు ఈ సినిమాలో తిరుగుతూ ఉంటారు కనుక విదేశాలకి చెందిన నటులు కూడా ఇందులో కనపడనున్నారు. అలానే ఈ సినిమాలో జంతువుల తో కూడుకున్న సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ జోనర్ లో వచ్చే ఫస్ట్ భారతీయ సినిమా ఇదే. మహేష్ బాబు సరసన శ్రద్ధా కపూర్ నటించచ్చని టాక్.