Ads
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే గుర్తొచ్చే జంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జోడీ కూడా ఒకటి. అంతగా ఈ జంట ఆకట్టుకున్నారు. వీరు సినిమాలో నటిస్తున్నప్పుడు అయిన పరిచయం, ప్రేమగా మారి,పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.తాజాగా వీరిద్దరిది ఒక ఫోటో వైరల్ అవుతుంది.ఖలేజా లో దేవుడు ఓదారుస్తున్నాడు అనే స్టిల్ అది. ఆ ఫోటో చూసేయండి.
Video Advertisement
సినిమాల్లో నటిస్తూ ఆ తరువాత వివాహ బంధంతో ఒక్కటైన వారిలో మహేష్, నమ్రత జోడీ ఒకటి. అయితే వీరి ప్రేమకథ ఎలా ప్రారంభం అయ్యిందంటే సూపర్ స్టార్ మహేష్ బాబు , నమ్రతలు ‘వంశీ’ మూవీలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో నెల రోజులు జరిగింది. వీరిద్దరి మధ్య ఆ సమయంలోనే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా ఆ తరువాత ప్రేమగా మారింది. అయితే ముందుగా లవ్ ప్రపోజ్ చేసింది నమ్రతనే. అప్పటికే మహేష్ నమ్రతను ఇష్టపడుతుండడంతో వెంటనే ఒకే చెప్పేశారంట.
అలా ఈ ప్రేమజంట దాదాపు 4ఏళ్లపాటు ప్రేమలో మునిగితేలారు. అయితే సెలబ్రిటీల పర్సనల్ విషయాలు సాధారణంగా మీడియాకు లీకవుతుంటాయి. కానీ మహేశ్ బాబు -నమ్రతల విషయం బయటికి రాకపోవడం విశేషం. నాలుగేళ్ళ తర్వాత ఇద్దరు వారి కుటుంబ సభ్యులకు తమ లవ్ గురించి చెప్పారట. మొదట్లో మహేష్ ఫ్యామిలీ కొంచెం బెట్టు చేయడంతో, మహేష్ సోదరి మంజుల అందరిని ఒప్పించిందట. ఆ విధంగా ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో 2005లో ఫిబ్రవరి 10న వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది.
End of Article