మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంత అంత కాదు. మహేష్ బాబు సినిమాల కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తూ ఉంటారు. సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయని చూస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Video Advertisement

ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ ఇంకా రానప్పటికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. అయితే రాజమౌళి సినిమాలు అంటే వేరే లెవెల్ లో ఉంటాయి అని అందరికీ తెలిసిందే.

is rajamouli over rated..??

బాహుబలి ఆర్ఆర్ వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయారు రాజమౌళి. మరి రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. పైగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఏదో ఒక పెద్ద సర్ఫరైజ్ ని ప్లాన్ చేస్తారని ఆడియన్స్ అంతా భావిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోయాయి. అయితే రాజమౌళి తీసే సినిమాలు ఎక్కువగా రెండు పార్టులు కింద ఉంటాయి కదా..? అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ కూడా రెండు పార్ట్స్ కింద ఉన్నాయి.

other indutries trying to beat bahubali..??

అది కూడా మంచి సక్సెస్ ని అందుకుంది. ఇలా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా తీస్తూ ఉంటారు. పుష్ప కి కూడా పార్ట్ వన్ పార్ట్ టూ ఉంది. ఇలా రెండు పార్ట్స్ కింద ఉన్న సినిమాల హీరోలకి హిట్ తో పాటుగా మంచి పేరు వస్తుంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ సలార్ కూడా రెండు పార్ట్స్ కింద విడుదల చేస్తున్నారని తెలుస్తోంది.

కార్తికేయ సినిమా కూడా కార్తికేయ వన్, కార్తికేయ 2 కింద తీశారు చందు మొండేటి. అయితే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాకి కూడా రెండు పార్ట్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఏదేమైనా మహేష్ బాబుతో ఈ సినిమాని రెండు పార్ట్స్ కింద తీస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ముందుగానే రెండు పార్ట్స్ స్టోరీని రెడీ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2023 సమ్మర్లో కానీ ఆ తర్వాత కానీ స్టార్ట్ అవ్వనుంది అప్పటివరకు మనకి క్లారిటీ అయితే రాదు. మరి ఏమవుతుంది అనేది చూడాల్సి ఉంది.