Ads
నందమూరి బాలకృష్ణ హొస్ట్ గా చేస్తున్న ఆహా వారి అన్ స్టాపబుల్ షో కి మంచి క్రేజ్ ఏర్పడింది. బాలకృష్ణ ని ఇప్పటివరకు చూడని విధంగా ఈ షోలో ఆడియన్స్ చూస్తున్నారు. బాలకృష్ణ నిజంగా బయట ఇలా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు. బాలయ్య కూడా మంచి ఎనర్జీతో షో కి వచ్చిన గెస్ట్ లతో ఆటలాడుకోవడం, కబుర్లు చెప్పడం చేస్తూ ఈ షో కి మంచి రేటింగ్ తీసుకొస్తున్నారు.
Video Advertisement
అయితే అన్ స్టాపబుల్ షో కి ఇప్పటికే తెలుగు సినిమాలో ఉన్న స్టార్ హీరోలు అందరూ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, రణబీర్ కపూర్, చంద్రబాబు నాయుడు, రాజమౌళి ఇలా పెద్ద పెద్ద వారంతా బాలయ్య షో కి వచ్చారు.అలాగే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్స్ కూడా ఈ షో లో సందడి చేస్తున్నాయి.అయితే ఇప్పుడు బాలయ్య షోకి సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నాడు అనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.
మహేష్ తో పాటు త్రివిక్రమ్ కూడా ఈ షో కి గెస్ట్ గా హాజరుకానున్నారట. అయితే త్వరలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య అనుష్టాన షో కి వెళ్తున్నట్లు వార్త వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి నిజంగా పండగ లాంటి న్యూస్ ఇది. బాలయ్య షోలో మహేష్ ఎలా కనిపిస్తారు ఎలా మాట్లాడుతారని ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
End of Article