మహేష్ బాబు సారీ చెప్పారా..? ఈ పోస్ట్ లో ఏం ఉందంటే..?

మహేష్ బాబు సారీ చెప్పారా..? ఈ పోస్ట్ లో ఏం ఉందంటే..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మేకర్స్ పోస్టర్స్, టీజర్‍తో  అంచనాలను క్రియేట్ చేశారు.  కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘దమ్ మసాల’ కు ప్రేక్షకులను రెస్పాన్స్ వచ్చింది.

Video Advertisement

ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను వేగిరం చేసింది. ఈ క్రమంలో సెకండ్ సింగిల్ గా ‘ఓ మై బేబీ’ పాటని రిలీజ్ చేశారు. అయితే ఈ పాట పై నెట్టింట్లో ట్రోలింగ్ జరిగింది. ట్రోలింగ్ పై పాట రచయిత, నిర్మాత నాగవంశీ ఫైర్ అయ్యారు. అయితే దీనిపై మహేష్ బాబు సారీ చెప్పారంటూ ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
‘ఓ మై బేబీ’ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి గుంటూరు కారం యూనిట్ మీద మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం దానిపై పాట రచయిత రామజోగయ్య శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయడంతో ఆన్ లైన్ వార్ మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా అకౌంట్ కూడా డిలీట్ చేసారు. ఈ ట్రోలింగ్ పై నిర్మాత నాగవంశీ రెస్పాండ్ కావడం మరింత హాట్ టాపిక్ కి దారి తీసింది. ఆ తరువాత ఆ పోస్ట్ డిలీట్ చేసాడు. ఇలా ఇద్దరు వెనక్కి తగ్గడానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు క్షమాపణ చెప్పడమే అంటూ ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది.
ఆ పోస్ట్ లో “నాగవంశీ తన ట్వీట్లను తొలగించాడు. అతను ఫ్యాన్స్ గురించి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేశాడు. మహేష్‌బాబు చిత్ర యూనిట్ ఫ్యాన్స్ పై సోషల్ మీడియాలో ఉపయోగించిన భాషతో అప్ సెట్ అయ్యాడు. అది చాలా తప్పు అనేలా చెప్పారు. మహేష్ అన్నకి తన ఫ్యాన్స్ అంటే ఎంత పిచ్చి అనేది అర్దమైందా? వర్క్ తో మాట్లాడదాము, ఇంప్రెస్ చేద్దాము. వాళ్ళు చెప్పారు అంటే వూరికే చెప్పరు. ఏదైనా అని ఉంటే నా తరుపున క్షమించండి, రామజోగయ్య గారు, తిరిగి వర్క్ కు రండి. నెక్ట్స్ పాట అదిరిపోయేలా రాయండి అనేలా చెప్పారంట.ప్రొడక్షన్ హౌస్ మరియు నిర్మాతలు తెలుసుకోవలసిన విషయం, ఎండ్ ఆఫ్ ద డే అభిమానులే అంతా, వాళ్లకోసమే సినిమాలు తీసేది అనే స్టేట్‌మెంట్ ఉంటుంది ఏ హీరో నుండి అయినా, అట్లాంటిది వారిని జడ్జ్ చేయవద్దు. మీ చెత్త ప్రవర్తన వల్ల మా హీరో మాకు సారీ ఫిల్ అవడం మాకు ఇష్టం ఉండదు. మా అన్నయ సినిమా అండి.సెలెబ్రేషన్స్ మేము చేసుకుంటాము అంటే అర్ధం, సెలెబ్రేషన్స్ చేసేలా సాంగ్స్ ఇవ్వాలి అని, బలవంతంగా రుద్దడం కాదు. ఓవర్ ఆల్ గా ఇక్కడితో పంచాయితీ అయిపొయింది. అదిరిపోయే కంటెంట్ మీరు మాకు ఇవండి. దాన్ని నెక్స్ట్ లెవల్ సెలెబ్రేషన్స్ మేము చూసుకుంటాము” అని చెప్పుకొచ్చారు.

Also Read: “పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..!


End of Article

You may also like