మహేష్ బాబు ధరించిన ఈ బ్యాగ్ ధర ఎంతో తెలుసా..?

మహేష్ బాబు ధరించిన ఈ బ్యాగ్ ధర ఎంతో తెలుసా..?

by Mohana Priya

Ads

ఈ సంవత్సరం గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సినిమాకి ఇంకా సమయం ఉంది. అంతలోపు మహేష్ బాబు కొన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. అంతే కాకుండా ఇటీవల స్కేటింగ్ కూడా నేర్చుకున్నారు. సినిమా భాగాలుగా రూపొందుతుంది. సినిమా మొత్తం ఒక అడ్వెంచర్ నేపథ్యంలో నడుస్తుంది. కొంత మంది హాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా మిగిలిన నటీనటుల విషయం ఇంకా బయటికి రాలేదు. స్క్రిప్ట్ పని అయిపోయింది.

Video Advertisement

mahesh babu bag cost

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది అని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మహేష్ బాబు ఒక పక్కన సినిమాకి వర్క్ చేస్తూనే, మరొక పక్క కుటుంబంతో కూడా సమయాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు ఇటీవల హాలిడేకి వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి వెళుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు హాలిడే నుండి వచ్చాక మళ్ళీ సినిమా పని మొదలు పెడతారు. అయితే మహేష్ బాబు కొత్త పిక్చర్స్ లో ఆయన వేసుకున్న బ్యాగ్ మీద అందరి దృష్టి పడింది.

ఆ బ్యాగ్ ధర ఎంత ఉంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆ బ్యాగ్ లూయి విట్టోన్ అనే ఒక సంస్థ తయారు చేసింది. ఈ బ్యాక్ ధర 3. 92 లక్షలు. మహేష్ బాబు గతంలో కూడా ఈ బ్యాగ్ ధరించి వెళ్తున్నట్టు కనిపించారు. కొంత కాలం నుండి మహేష్ బాబు ఇదే బ్యాగ్ వాడుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు వాడే వస్తువులు సింపుల్ గా కనిపించినా కూడా ధరలు ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంది. కానీ ఆ బ్రాండ్ వస్తువుల ధరలు సాధారణంగా ఇలాగే ఉంటాయి. అయితే మహేష్ బాబు సినిమాలకి దూరంగా ఉన్నా కూడా అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో ప్రేక్షకులని పలకరిస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.


End of Article

You may also like