Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ అంటే ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్. వీరిద్దరిది ప్రేమ వివాహం. వంశీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడి, ఆ తర్వాత ప్రేమగా మారి, అది పెళ్లి వరకు దారి తీసింది. ఇవాళ వీరిద్దరి పెళ్లిరోజు. 19 సంవత్సరాల క్రితం ఇదే రోజు వీరి పెళ్లి జరిగింది.
Video Advertisement
సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది వీరికి విషెస్ తెలుపుతున్నారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విషెస్ తెలుపుకున్నారు. పెళ్లికి ముందు వరకు నమ్రత కొన్ని సినిమాలు చేశారు. పెళ్లి తర్వాత నుండి నమ్రత ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే ఈ విషయం గురించి నమ్రత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నమ్రత ఈ విషయం మీద మాట్లాడుతూ, తనకి ఉద్యోగం చేసే భార్య వద్దు అని మహేష్ బాబు క్లారిటీగా ఉన్నారు అని చెప్పారు. ఈ విషయం మీద వాళ్లు మాట్లాడుకున్నారు అని అన్నారు. అయితే, నమ్రతా శిరోద్కర్ కూడా ఒక కండిషన్ పెట్టారట. తనకి బంగ్లాలో ఉండడం ఇబ్బందిగా అనిపిస్తుంది అని, అందుకే పెళ్లయిన తర్వాత కొన్నాళ్లు అపార్ట్మెంట్ లో ఉండాలి అని ఒక కండిషన్ పెట్టారట. ఈ కండిషన్ కి మహేష్ బాబు అంగీకరించారు. మహేష్ బాబుకి ఉద్యోగం చేసే భార్య వద్దు అనే కండిషన్ కి నమ్రతా శిరోద్కర్ కూడా అంగీకరించారు.
అలా వీరిద్దరి పరస్పరం అంగీకారంతోనే వారి పెళ్లి జరిగింది. పెళ్లయిన తర్వాత నమ్రత గౌతమ్, సితారని చూసుకోవడంలో, అలాగే మహేష్ బాబు వ్యాపార వ్యవహారాలు కూడా చూసుకోవడంలో బిజీ అయిపోయారు. కానీ, పెళ్లయ్యాక కూడా నమ్రతకి సినిమాల్లో నటించే కొన్ని అవకాశాలు వచ్చాయట. కానీ నమ్రత ఇందుకు అంగీకరించలేదు. ఎలాంటి పాత్ర వచ్చినా కూడా సినిమాల్లో కనిపించాలి అని అనుకోవట్లేదు అని నమ్రత చెప్పారు. అయితే సినిమాల్లో నటించకపోయినా కూడా సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్తాను అని అన్నారు. మహేష్ బాబు సినిమా షూటింగ్స్ కి తాను వెళతాను అని, ఆ వాతావరణాన్ని తాను ఎంజాయ్ చేస్తాను అని నమ్రత చెప్పారు.
watch video :
ALSO READ : ప్రేమకోసం సినిమా ఫీల్డ్ ని వదిలేసాడు…పెళ్లి తర్వాత ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యారు.! ఎవరంటే.?
End of Article