మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్న మహేష్ అభిమానులు…!

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్న మహేష్ అభిమానులు…!

by Mounika Singaluri

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి సోషల్ మీడియాలో ట్రోల్స్ కొత్త ఏం కాదు. ప్రతి సినిమాలో తమన్ సాంగ్ ఏదో ఒకటి రిలీజ్ అమ్మడం ఆ సాంగ్ ఈ సాంగ్ కి కాపీ అంటూ ట్రోల్ చేయడం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అయితే తమను ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఆ సినిమాలో మొదట దమ్ మసాలా సాంగ్ విడుదలైంది. ఆ సాంగ్ ఫర్వాలేదు అనిపిస్తుంది. అయితే తాజాగా ఆ సినిమా నుండి రెండో సాంగ్ ఓ మై బేబీ విడుదలైంది.

Video Advertisement

ఈ సాంగ్ మహేష్ ఫ్యాన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి వ్యతిరేకంగా నెగిటివ్ ట్రెండును సృష్టించారు. సోషల్ మీడియాలో విపరీతంగా తమన్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఇదేం సాంగ్ ఇదే లిరిక్స్ అంటూ ఒక రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. అసలు మహేష్ సినిమాకి తమన్ సరిగ్గా పాటలు ఇవ్వడు, ఇంతకుముందు సర్కారు వారి పాట సినిమా కూడా ఇలాగే చేశాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే మహేష్ బాబు తర్వాత రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడని ఇంకో నాలుగేళ్ల వరకు తమకి మంచి మంచి పాటలు విని అవకాశం ఉండదని, కనీసం ఈ సినిమాకి అయినా మంచి పాటలు అందించాలని ఫ్యాన్స్ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి కూడా తమన్ వద్దంటూ మహేష్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయినా త్రివిక్రమ్ పట్టు మీద ఈ సినిమాకి తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. తీరా చూస్తే తమన్ మహేష్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. మిగతా పాటలైనా మహేష్ ఫ్యాన్స్ ను సంతృప్తి పరుస్తాయో లేదో చూడాలి.


You may also like

Leave a Comment