దూకుడు టైంలో మహేష్ బాబు మాత్రమే సాధించిన… ఆ గుర్తింపు ఏంటో తెలుసా..??

దూకుడు టైంలో మహేష్ బాబు మాత్రమే సాధించిన… ఆ గుర్తింపు ఏంటో తెలుసా..??

by Mounika Singaluri

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను మరోస్థాయిలో నిలబెట్టిన మూవీ దూకుడు. పోకిరి వంటి బ్లాక్‌బాస్టర్ తరువాత సైనికుడు, అతిథి, ఖలేజా సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. కచ్చితంగా హిట్ కొట్టాల్సిన సమయంలో మహేష్ కొత్త పంథా ఎంచుకున్నాడు.

Video Advertisement

శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు మూవీకి సైన్ చేశాడు. తనలోని కామెడీ యాంగిల్ బయట పెడుతునే.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. 2011 సెప్టెంబర్ 23న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వసూళ్ల పరంగా అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది.

mahesh babu record remunaration
దూకుడు మూవీ విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డైరెక్టర్ శ్రీను వైట్ల ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ దూకుడు మూవీ రిలీజ్ అయి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. మహేష్ బాబు ఈ మూవీ స్క్రిప్ట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఇది నా పుట్టినరోజుకు ఒక రోజు ముందుగానే అత్యంత విలువైన బహుమతిని ఇచ్చింది. మొత్తం నటీనటులు, సిబ్బందికి, ఎప్పటికీ మీ హృదయాలలో ఉంచినందుకు అభిమానులకు ధన్యవాదాలు..’ అంటూ ఆయన రాసుకొచ్చారు.

mahesh babu record remunaration
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. దూకుడుతో రికార్డులన్నీ తిరగరాసి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు మహేష్ . ఈ చిత్రం తర్వాత అతని రెమ్యునరేషన్ ఆకాశాన్ని తాకింది. అప్పటి నుండి అతను ప్రతి సినిమాకు రూ.15 కోట్లు తీసుకున్నాడు. ఆ సమయంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మూడు సినిమాల (దూకుడు, 1, ఆగడు) కోసం మహేష్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం మహేష్ కి మొత్తం రూ.50 కోట్లు చెల్లించింది.

mahesh babu record remunarationఇంతటి భారీ ప్యాకేజీని అందుకున్న తొలి తెలుగు నటుడిగా మహేష్ బాబు రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం మహేష్ రెమ్యూనరేషన్ ఒక్క సినిమాకే 70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మహేష్ తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం 65 -70 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది.


End of Article

You may also like