సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జస్ట్ యావరేట్ టాక్ వస్తేనే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ మూవీ బ్లాక్ బాస్టర్ అయితే ఇక వసూళ్ళు ఊచకోతే అని చెప్పవచ్చు. మహేశ్‌కు మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే.

Video Advertisement

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీలో నటించబోతున్నాడు. జక్కన్న మూవీకి మహేష్ తీసుకునే రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. మహేష్ వయసు పెరిగే కొద్దీ ఆయన అందం కూడా పెరుగుతోంది. తనయుడు గౌతమ్ పక్కన నిలబడితే బ్రదర్స్ లా  కనిపిస్తున్నారు. ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటించకుండానే దేశవ్యాప్తంగా మహేష్ కు మిలియన్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఇరవై ఏళ్ల  కెరీర్‌లో చాలా బ్లాక్ బస్టర్ హిట్స్  ఇచ్చారు. ఇప్పటికీ కూడా అదే జోష్‌తో కొనసాగుతున్నారు. అయితే మహేష్ మూవీ షూటింగ్ లో ఉంటారు. లేదంటే కటుంబంతో కలిసి గడుపుతారు. పక్కా ప్యామిలీ పర్సన్.
ఒక్క రూమర్ లేకుండా, వివాదాలకు దూరంగా ఉంటారు. అంతే కాకుండా వ్యాపారంలో పెట్టుబడులు, యాడ్స్ ద్వారా మహేష్ ఓ రేంజ్‌లో సంపాదిస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ తన పారితోషికాన్ని పెంచినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసే సినిమా కోసం మహేశ్ 70 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.  త్రివిక్రమ్ మూవీ తర్వాత, రాజమౌళి సినిమాలో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం 110 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మూవీ మహేష్ కెరిర్ లో 29వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దాంతో ఈ మూవీ షూటింగ్ మొదలు కాక ముందే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ ఈ మూవీ కోసం ఎక్కువ రోజులను కేటాయించబోతున్నాడని, అందుకే ఈ మూవీకి  110 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు.

Also Read: ఆదిపురుష్ సినిమాలో “సైఫ్ అలీఖాన్” లాగానే… సినిమాల్లో “రావణుడి” పాత్ర పోషించిన 10 యాక్టర్స్..!