Mahesh Babu: ఫ్యాన్స్‌కి పండగే.. గ్యాంగ్ స్టర్‌గా సూపర్ స్టార్ మహేశ్ బాబు..!

Mahesh Babu: ఫ్యాన్స్‌కి పండగే.. గ్యాంగ్ స్టర్‌గా సూపర్ స్టార్ మహేశ్ బాబు..!

by Harika

Ads

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే మహేశ్ బాబు తర్వాత భారీ సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.

Video Advertisement

 

అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఒక ప్రాజెక్ట్ ఉంది. అయితే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో తర్వాతి సినిమా చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేశ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Mahesh Babu Sandeep Vanga Movie Details

మహేశ్ బాబు గురించి సందీప్ వంగ ఒక పవర్‌ఫుల్ స్టోరీ రాసి ఉంచారని పలు ఇంటర్వూల్లో తెలిపారు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్‌లో ఫ్యాన్స్‌ను నచ్చేలా ప్రిపేర్ చేసుకున్నారు. అయితే మహేశ్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని సమాచారం.

మరి ఈ సినిమాలో మహేశ్ గ్యాంగ్ స్టర్‌ రోల్ చేస్తారనే వార్తల్లో ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ మహేశ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేసినట్లయితే ఫ్యాన్స్‌కి ఇక పండగే.


End of Article

You may also like