సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సినిమాల్లో నటించారు. మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆయన అందరికీ సుపరిచితమే. సూపర్ స్టార్ మహేష్ బాబుకి క్రేజ్ కూడా ఎక్కువే. తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా దూసుకు వెళ్ళిపోతున్నారు. అలానే వరుస విజయాలతో కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు మహేష్ బాబు.

Video Advertisement

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ తో కలిసి మహేష్ బాబు అతడు, ఖలేజా సినిమాలు చేశారు.

mahesh babu 1 telugu adda

అలానే మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి తో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీద అభిమానుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్ సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికా అడవి నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని టాక్ వినబడుతోంది అయితే మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఎప్పటికీ మర్చిపోలేము. మహేష్ బాబు ఒక్కడు సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. పైగా కథ కూడా చాలా బాగుంటుంది. అందరిని బాగా అలరించింది.

ఆ సినిమాలో మహేష్ బాబు చెల్లెలు కింద నిహారిక నటించారు. ఆ సినిమాలో మహేష్ బాబుని నిహారిక బాగా ఆట పట్టిస్తూ ఉంటారు అలానే తల్లిదండ్రుల దగ్గర ఇరికించాలని చూస్తూ ఉంటారు. చాలా చక్కటి పాత్ర చేశారు నిహారిక. అలానే ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకటేష్ కి మేనకోడలు పాత్ర చేశారు. కానీ తర్వాత ఈమె సినిమాల్లో కనపడలేదు. చాలా మంది నటులు సినిమాలకి పెళ్లి తరవాత దూరం అయ్యినట్టే నిహారిక కూడా పెళ్లి తరవాత సినిమాలకి దూరం అయ్యింది. పదేళ్ల క్రితమే ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. పొలిటికల్ ఫ్యామిలీ కి చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈమెకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.