మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో. ఆయనతో సినిమా చేయాలని చాలా మంది హీరోయిన్లు అనుకుంటూ ఉంటారు. ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో మహేష్ బాబు పని చేశారు. అలానే ఎంతో మంచి ఫేమ్ ని కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు పొందారు. మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో హిట్స్ ని కూడా అందుకున్నారు.

Video Advertisement

మహేష్ బాబు కూతురు సితార ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. తరచూ ఆమె ఏదో ఒక వీడియో చేస్తూ ప్రేక్షకులకి దగ్గరగానే ఉంటుంది. అయితే మహేష్ బాబు కి మాత్రం సినిమాల వలన ఎక్కువ ఖాళీ ఉండదు.

mahesh babu-trivikram next movie story resembelms that salman movie..??

అయినప్పటికీ మహేష్ బాబు కుటుంబ సభ్యులతో దొరికే సమయంలో కాస్త సమయాన్ని గడుపుతూ వుంటారు. కానీ ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని గడపడం అంటే మహేష్ బాబుకి ఇష్టం. అందుకనే మహేష్ బాబు షూటింగ్ లేనప్పుడు హాలిడేస్ కి ఏదైనా ప్రదేశాలకు వెళ్ళి పోతూ ఉంటారు.

మహేష్ బాబుకి ముగ్గురు సోదరీమణులు కూడా ఉన్నారు వారిలో మంజుల కూడా ఒకరు. ఈమె హీరోయిన్ గా రావాలి అనుకున్నప్పటికీ అవ్వలేదు. కానీ ఈమె సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టి కొనసాగిస్తున్నారు. పోకిరి సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించారు మంజుల. ఈ మధ్య మంజుల తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు.

అలానే ఓ యూట్యూబ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేశారు ఈమె. సూపర్ స్టార్ హౌస్ ని యూట్యూబ్ ఛానల్ లో చూపించారు కూడా. మంజుల కుమార్తె పేరు జాహ్నవి స్వరూప్. ఈమె తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. జాహ్నవి అంటే మహేష్ బాబుకి చాలా ఇష్టమట. పిల్లలు అందరూ కలిస్తే చిన్నపిల్లవాడిలా మహేష్ బాబు మారిపోతారని చెప్పారు మంజుల. ఈ మధ్య మంజుల తన కుమార్తె జాహ్నవి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి చూస్తుండగానే పెద్దదై పోతుంది అని చెప్పారు.