Ads
సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తతో దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్, నటశేఖర కృష్ణ అంటే ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తెలుగు సినిమాకు ఓ ఎమోషన్. ధైర్యానికి కేరాఫ్ అడ్రెస్. సూపర్ స్టార్ అంత్యక్రియలు మహాప్రస్థానం లో జరిగిన విషయం తెలిసిందే.
Video Advertisement
స్వర్గస్థులైన సూపర్ స్టార్ కృష్ణ గుర్తులను పదిలంగా ఉంచుకోవాలని ఆయన కుటుంబం నిర్ణయించుకుంది. దీని కోసం ఆయన పేరు మీద ఒక స్మారకాన్ని నిర్మించాలని మహేష్ బాబు కుటుంబం నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ స్మారకంలో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు.. ఆయనకు సంబంధించిన గుర్తులన్నింటినీ పొందుపరుస్తారట.
కృష్ణ భౌతిక కాయాన్ని వారి సొంత స్థలం లో పెట్టి.. అక్కడ స్మారకం ఏర్పాటు చెయ్యాలన్న ఆయన అభిమానుల కోరిక తీరకపోయినా.. ఈ విధంగా వేరే ఏర్పాటు చెయ్యాలనుకోవడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. కృష్ణ నటించిన సినిమాలకు సంబంధించిన ఫొటోలు, అవార్డులను ఈ మెమోరియల్‌లో ఉంచుతారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఈ మెమోరియల్‌ను సందర్శించే ప్రజలు కాసేపు అక్కడే గడిపి.. సూపర్ స్టార్ కృష్ణ గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా ఈ మెమోరియల్ ఉండనుందని అంటున్నారు. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్‌ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు సమాచారం. కృష్ణ మెమోరియల్‌ను మాత్రం భవిష్యత్తు తరాలు కూడా చూసేలా, ఆయన గురించి తెలుసుకునేలా నిర్మించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట.
End of Article