సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటూ మరొక పక్క ఇతరులకి సహాయం అందిస్తూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా ఇదే.

Video Advertisement

త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా అందరిని ఆకట్టుకునేలానే వుంది. ఈ సినిమా హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా షురూ అయింది.

mahesh babu 1 telugu adda

పూజా హెగ్డే మహేష్ బాబు సరసన నటిస్తున్నారు. అలానే 2024 సమ్మర్ కి రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ప్రపంచంలో చాలా ప్రాంతాలని తిరిగి వస్తూ ఉంటారు దీనితో విదేశీ నటులు కూడా ఈ సినిమాలో కనపడనున్నారు. ఈ జోనర్ లో రానున్న మొట్టమొదటి సినిమా ఇదే. ఇదిలా ఉంటే ఈ మధ్యనే మహేష్ బాబు తన తండ్రి కృష్ణ ని కోల్పోయారు దీంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నారు.

కృష్ణ కి నివాళి అర్పిస్తూ మహేష్ బాబు ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన తన బాధని షేర్ చేసుకోవడంతో పాటు బలంగా ఉన్నట్లు అనిపిస్తోందని అది తన తండ్రి ఇచ్చిన ధైర్యం వల్లే అని మహేష్ బాబు రాసుకు వచ్చారు. తన తండ్రి మరణంతో బాధలో ఉండకుండా ధైర్యంగా ఉండాలని మహేష్ బాబు అనుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అలానే తాను తన తండ్రి మరణం లో ఉండిపోకుండా మామూలు జీవితంలోకి వచ్చేయాలని పోస్ట్ ద్వారా చెప్పినట్లు తెలుస్తోంది. అలానే మహేష్ బాబు నమ్రత ఏషియన్ గ్రూప్ తో కలిసి హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ ని కూడా మొదలుపెట్టారు. ఏఎన్ అని దీనికి పేరు పెట్టారు.