సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికీ రెండు సినిమాలు వచ్చాయి ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది. ఇప్పటి వరకు రెండు సినిమాలు రావడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకులకి ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ ని ఇంకా రిలీజ్ చేయకపోవడంతో ssmb 28 అని అంటున్నారు. ఈ సినిమా అప్డేట్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమా రైట్స్ భారీ రేటుకి అమ్ముడైపోయాయి అనే వార్త మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినపడుతోంది.

ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ మ్యూజిక్ రైట్స్ తో పాటుగా ఓవర్సీస్ రైట్స్ కి కూడా భారీ ఎత్తున ఆఫర్లు వస్తున్నాయట. ఈ సినిమాకి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ ని త్వరలో తీసుకురాబోతున్నారట. ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చే విధంగా మార్చి 22న పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 22న ఉగాది కనుక ఆ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా టైటిల్ ని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు టాక్.  ఉగాదితో కొత్త తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగాదినాడు ఏదైనా కొత్త పనికి శ్రీకారం చుడితే ఆ పని విజయవంతంగా పూర్తి అవుతుందని అంతా నమ్ముతారు.

ssmb28-telugu-adda

అందుకోసమే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ రోజు సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారట. ఈ సినిమాకి ”ఛస్తే” అనే టైటిల్ ని పెట్టే అవకాశం ఉంటున్నట్లు తెలుస్తోంది. సినిమాకి కరెక్ట్ గా ఛస్తే అనే పదం సూట్ అవుతుందట. ఇది చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇదేం టైటిల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ గా ఈ సినిమాలో పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే జగపతిబాబు ఒక కీలక పాత్ర చేస్తారట. ఈ సినిమాకి సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. ఈ సినిమా కి సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ సారథి స్టూడియోస్ లో పూర్తయింది.