సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందరికీ నమ్రత సుపరిచితమే. ఎప్పుడూ ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పర్సనల్ విషయాలను, మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో సరదాగా షేర్ చేసుకుంటూ ఉంటారు.

Video Advertisement

అయితే నమ్రత గురించి చాలా మందికి ఈ విషయాలు తెలియవు. మహేష్ బాబు నమ్రత తో కలిసి వంశీ సినిమా చేసారు. ఆ తరవాత వీళ్లిద్దరికీ పెళ్లి అయ్యింది.

నమ్రత, మహేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా కలిసి ఈ జంట ఉంటారు. నమ్రత పెళ్లి అయ్యాక సినిమాలకి దూరం అయ్యిపోయింది. నమ్రత గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాలు కొన్ని బయటకి వచ్చాయి. మరి వాటి కోసం మనం ఇప్పుడు చూసేద్దాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత పుట్టింది ఆంధ్ర లో కాదు. ఈమె మహారాష్ట్ర లో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి పేరు నితిన్ శిరోద్కర్. ఈయన అప్పట్లో మంచి క్రికెటర్ గా రాణించారు. ముంబై టీం కి దేశ వాలి ఆటగాడు ఈయన. క్రికెట్ తో ఈయన మంచి పేరు ని పొందారు. పైగా దిలీప్ వెంగాసర్కార్, సునీల్ గ‌వాస్క‌ర్ వంటి పెద్ద ఆటగాళ్ల తో ఈయన క్రికెట్ ఆడేవారుట. ఇది నిజంగా గొప్ప విషయమే. క్రికెట్ లో ఆయన మంచి బౌలర్. చాలా మంది ఆయన ఆట ని చూసి షాక్ అయ్యేవారట.