సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సినిమాలు చేయడం మానేసినా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. చాలా మంది నటులు పెద్ద మనసు తో ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు. ఇటువంటి వార్తలు తరచూ మనం చూస్తూ ఉంటాం. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందే ఉంటారు. మహేష్ భార్య నమ్రత తన భర్త చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటారు.

Video Advertisement

అలానే పిల్లల బాధ్యతను కూడా ఆమె చూసుకుంటూ ఉంటారు. అలానే ఆమె బిజినెస్లని, సినిమాలని కూడా చూసుకుంటూ ఉంటారు.

తాజాగా మహేష్ భార్య చేసిన పని చూసి అభిమానులు మహేష్ దంపతుల ని ప్రశంసల తో ముంచేస్తున్నారు. ఇక ఇంతకీ మహేష్ భార్య నమ్రత చేసిన పని ఏమిటి..? ఎలా తన విశాల హృదయాన్ని చాటుకున్నారు అనే విషయాన్ని చూద్దాం. మరో సారి విశాల హృదయాన్ని మహేష్ సతీమణి నమ్రత చాటుకున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక లేడీ ఏవియేషన్ స్టూడెంట్ కి స్పెషల్ లాప్టాప్ ని అందించారు. నమ్రత కేవలం ఇది మాత్రమే కాదు ఆమె చదువుకి అయ్యే ఖర్చు కూడా ఆమె భరిస్తానని ప్రామిస్ చేసింది.

ఆ అమ్మాయి తో పాటుగా ఆమె తండ్రి కూడా నమ్రత, మహేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చాలా మంది చదువు కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. చదువుకి అయ్యే ఖర్చు భరించలేకపోతున్నారు. చదువుకునేందుకు నాకు సహాయం చేసారని మహేష్ బాబు గారికి నమ్రత మేడంకి థాంక్స్ అని ఆమె చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ని సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ పిఆర్ అండ్ మార్కెటింగ్ కన్సల్టెంట్ వంశీ శేఖర్ ట్విట్టర్ లో షేర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన వారంతా కూడా ఈ దంపతులని అభినందిస్తున్నారు.