Ads
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద రాధాకృష్ణ(చినబాబు) భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తయింది. అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సింది. కానీ మహేష్ బాబు తల్లి చనిపోవడంతో ఈ సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయం మీద కాస్త సందిగ్ధత నెలకొంది.
Video Advertisement
కాగా.. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అది కూడా మహేష్ చేస్తోన్న రోల్‌కి సంబంధించి .. చక్కర్లు కొడుతోన్నవార్తలు మేరకు ఈ చిత్రం లో మహేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించబోతున్నారట.
సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ రోల్‌లో ఇప్పటి వరకు మహేష్ నటించలేదు. నాలుగు పదుల వయసు దాటిన మహేష్‌ను సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా చూపించటం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి మాటల మాంత్రికుడు మహేష్ లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. బరువు తగ్గమని చెప్పటమే కాకుండా.. సిక్స్ ప్యాక్ లుక్ ఉండేలా చూసుకున్నారు. అలాగే కాస్త గడ్డం పెంచి రగ్డ్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన మహేష్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మహర్షి సినిమాలో ఆయన ఒక ప్రముఖ కంపెనీకి సీఈవోగా నటించారు కానీ ఈసారి ఆయన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపంచనుండడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 15వ తేదీ నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించే అవకాశం ఉందని, ఈ షెడ్యూల్ లో పూర్తిగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో సాగే కొన్ని సీన్స్ షూట్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమా హీరోయిన్ పూజా హెగ్డే కూడా సెకండ్ షెడ్యూల్ లో పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అతడు సినిమా మంచి స్పందన దక్కించుకోగా ఖలేజా మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మూడో సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయ. ఇక ఈ సినిమాకు ‘ఆరంభం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే టైటిల్ ఫిక్స్ చేశారని ఇక అఫీషియల్ గా దాన్ని అనౌన్స్ చేయడమే ఆఖరు అని అంటున్నారు.
End of Article