మహేష్ బాబు రాజమౌళి సినిమా వస్తుందని పదేళ్ల నుండి చెబుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. SSMB29 సినిమా గురించి అప్డేట్ ఏమి రాకపోయినా సరే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో వున్నాయి.

Video Advertisement

బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌ వంటి మూవీస్ ని తీసుకు వచ్చిన జక్కన్న మహేష్ కోసం కూడా పెద్ద గానే ప్లాన్ చేసుండచ్చని అంత అనుకుంటున్నారు.

పాన్ ఇండియా రేంజ్ కి  వెళ్లిన జక్కన్న నుండి ఈ మాత్రం ఎక్స్పెట్ చెయ్యడం తప్పే కాదు. అయితే ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలు రావక పోవడం తో SSMB29 నెక్స్ట్ ఇయర్  అయినా స్టార్ట్ అవుతుందా అని అందరూ అనుకుంటున్నారు. తాజా ఈ సినిమా కి సంబంధించి ఒక విషయం బయటకి వచ్చింది. ఇక ఆ వివరాలని చూస్తే.. మహేష్ తో మల్టీ మల్టీ స్టారర్‌ ప్లాన్ చేస్తున్నారట జక్కన. అయితే మరో హీరో గా తమిళ హీరో విక్రమ్ అని అనుకుంటున్నారట. అలానే ఆ పాత్రను బాలయ్య తో చేయించాలనే ఆలోచన కూడా వుంది జక్కన్నకి. అయితే ఏం అవుతుందనేది చూడాల్సి వుంది.

2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా రానుంది. పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరలోనే సెట్స్ మీద తీసుకు వస్తున్నారట. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా గురించి జక్కన హాలీవుడ్‌ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ తో తీయబోయే సినిమా ఇండియానా జోన్స్‌లాంటి ఓ అడ్వెంచరస్‌ మూవీ అని చెప్పారు. పైగా ఈ సినిమాకి  మహేష్‌ బాబునే పర్ఫెక్ట్ అని కూడా జక్కన్న అన్నారు. ఈ మూవీ కి కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. మరి ఎలా ప్రపంచమంతా చుట్టే  ఈ అడ్వెంచరస్‌ సినిమాను తీసుకు వస్తారో చూడాలి.