హైదరాబాద్ వ్యక్తి మీద బాలీవుడ్ వాళ్ళ సినిమా..! ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా కూడా ఇదే..!

హైదరాబాద్ వ్యక్తి మీద బాలీవుడ్ వాళ్ళ సినిమా..! ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా కూడా ఇదే..!

by Mohana Priya

Ads

తెలుగు వారి మీద, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి మీద సినిమాలు ఎక్కువగా రావట్లేదు అని అనుకుంటూ ఉంటాం. అంతే కానీ, వాళ్ల మీద సినిమాలు తీయాలి అని మన దగ్గర ప్రయత్నించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. బాలీవుడ్ ని ఎంత తిట్టినా కూడా బాలీవుడ్ ఈ విషయంలో మనకంటే ముందు ఉంటారు. ఎంతో మంది నిజ జీవితంలో స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తుల ఆధారంగా వాళ్ళ సినిమాలు రూపొందిస్తారు. అందులో కొంత మంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ వ్యక్తి మీద సినిమా రూపొందించారు. ఆ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

Video Advertisement

maidaan movie review amazon prime

ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఆ సినిమా అందుబాటులో ఉంది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన మైదాన్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్లలోకి వెళ్ళింది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, 1952 ప్రాంతంలో ఈ సినిమా జరుగుతుంది. హెల్సింకీ ఒలింపిక్స్‌లో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో భారత జట్టు యుగోస్లేవియా చేతిలో ఓడిపోతుంది. దాంతో అసలు జట్టు ఎందుకు ఓడిపోయింది అనే విషయాన్ని కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం (అజయ్ దేవగన్) ఫెడరేషన్ కి చెప్పాలి అని అనుకుంటాడు.

జట్టుకి మద్దతుగా నిలబడి వాళ్ళని గెలిపించాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. స్పోర్ట్స్ డ్రామా సినిమాలు రూపొందించడం అంటే చిన్న విషయం కాదు. ఒకపక్క స్పోర్ట్స్ ముఖ్యమైన అంశంగా తీస్తూనే, మరొక పక్క మిగిలిన విషయాలు కూడా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరుతుంది. ఈ సినిమాలో అన్ని విషయాలు కూడా సమానంగా ఉండడానికి ప్రయత్నించారు. సినిమా కలెక్షన్ల పరంగా రికార్డ్స్ సృష్టించకపోయినా కూడా, థియేటర్లో చూసినవాళ్లు నిరాశ పడలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి ఈ సినిమా అందుబాటులో ఉంది. సినిమా చూడని వాళ్ళు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. ఇంత మంచి సినిమాలు తీసినందుకు బాలీవుడ్ వాళ్ళని ప్రశంసించాలి. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా ఇదే అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like