Ads
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడి గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘విరూపాక్ష’. రెగ్యులర్ కమర్షియల్ కథ కాకుండా… మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకుని సినిమా చేయడం కలిసి వచ్చింది. తెలుగు ప్రేక్షకుల్ని సినిమా మెప్పించింది. వంద కోట్ల వసూళ్ళను రాబట్టింది.
Video Advertisement
ఈ చిత్రం లో ప్రతి ఒక్కరు అద్భుతం గా నటించారు. అయితే ఈ మూవీ రుద్రవనం అనే ఊరి చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో ఏ సమస్య వచ్చినా ‘ శాసనాల గ్రంథం ‘ లో పరిష్కారం ఉంటుంది అని ఆ ఊరి ప్రజలు విశ్వసిస్తారు. కాని దాని నేపథ్యంలో అనేక ట్విస్ట్ లు, చక్కటి స్క్రీన్ ప్లేతో ఈ మూవీని సూపర్ హిట్ చేసాడు దర్శకుడు కార్తీక్ దండు.
అయితే ఈ మూవీ చేతబడి నేపథ్యంలో తీశారు అంటూ అందరు కామెంట్స్ చేస్తున్నారు. కాని అసలు ఇందులో మెయిన్ మోటివ్ ని విస్మరిస్తున్నారు ప్రేక్షకులు. ఈ మూవీ స్టార్టింగ్ లో హీరో, అతడి తల్లి ఊరిలో స్కూల్ పెట్టడానికి స్థలం ఇవ్వడానికి వస్తారు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ తల్లిదండ్రుల మరణానికి కారణం.. ఊరివాళ్ల అజ్ఞానం. ఆ సమయంలో కలరా వ్యాపించడం వల్ల రుద్రవనం లో చాలా మంది చిన్నారులు మరణిస్తారు.
కాని ఊరిలో వల్ల అజ్ఞానం వల్ల హీరోయిన్ తల్లిదండ్రులను సజీవ దహనం చేస్తారు. అందుకే హీరో వాళ్ళు ఊరిలో స్కూల్ పెట్టడానికి స్థలం ఇస్తారు. కాని ఈ లోపే ఊరిలో ఇవన్నీ జరిగిపోతాయి. అందుకే క్లైమాక్స్ లో హీరోయిన్ వల్ల ఇంటిని స్కూల్ గా మార్చాలి అని చెప్తాడు సాయి ధరమ్తేజ్ . ప్రతి ఒక్కరు భయం తో కాకుండా.. బాధ్యతగా ఆలోచించాలి అని చెప్తాడు హీరో. అందరికీ చదువు ఉండాలి అన్నదే ఈ సినిమా యొక్క మోటివ్.
సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లో 15వ చిత్రంగా వచ్చిన ఈ మూవీ తో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మించాయి. విరూపాక్ష బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకు పోతుండడంతో కార్తీక్ దండు కి టాప్ బ్యానర్ల నుండి ఆఫర్లు వస్తున్నాయట. అయితే తన నెక్స్ట్ మూవీ కూడా థ్రిల్లర్ జోనర్ లో నే చేయాలనుకుంటున్నాడట ఈ దర్శకుడు.
Also read: “విరూపాక్ష” సినిమాలో ఈ పొరపాటు గమనించారా..? మీకు కూడా డౌట్ వచ్చిందా..?
End of Article