“పుష్ప” సెకండ్ పార్ట్‌లో జరిగే మార్పులు ఇవేనా.? ఈ ట్విస్ట్‌లు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా..?

“పుష్ప” సెకండ్ పార్ట్‌లో జరిగే మార్పులు ఇవేనా.? ఈ ట్విస్ట్‌లు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా..?

by Mohana Priya

Ads

అల్లు అర్జున్ ని పాన్ ఇండియన్ స్టార్ చేసిన సినిమా పుష్ప. ఈ సినిమా విడుదల అయినప్పుడు కొంత మందికి నచ్చింది. కొంత మందికి అంత పెద్దగా నచ్చలేదు. సుకుమార్ సినిమా అంటే ఇంకా ఎక్కువగా ఊహించుకున్నాం అని చెప్పారు. కానీ కొంత మందికి మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చింది. అల్లు అర్జున్ ని అలా చూడటం ఇదే మొదటిసారి.

Video Advertisement

పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అయితే ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. కాస్ట్యూమ్స్ దగ్గర్నుండి తన గెటప్ కి సంబంధించిన చిన్నచిన్న వివరాల వరకు కూడా చాలా జాగ్రత్తపడ్డారు అల్లు అర్జున్. అలాగే చిత్తూరు యాస కూడా చాలా బాగా మాట్లాడారు.

10 pushpa

సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకి అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. అప్పుడు ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. అయితే ఈ సినిమా రెండవ భాగం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన రెండు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఒకటి అంతకుముందు చెప్పినట్టుగానే ఈ సినిమాలో కేశవ పుష్ప రాజ్ కి యాంటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

reasons behind pushpa negative talk

మరొక ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలు మంగళం శీను భార్యగా నటించిన దాక్షాయిని పాత్ర పగతో శ్రీవల్లిని చంపేస్తుందట. దాంతో ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఆ పాత్ర కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ నటిని అనుకుంటున్నారట. ఇవన్నీ కూడా ముందు అనుకోలేదని, తర్వాత కథలో ఇవి మార్చారు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ సినిమా కథకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. పుష్ప 2లో జరిగే భారీ మార్పులు ఇవే అని అంటున్నారు.


End of Article

You may also like