ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి కొన్ని ఏళ్లపాటు శ్రమించింది.

Video Advertisement

‘బాహుబలి’ నుంచి ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని ఆశించిన వాళ్ళ నిరాశకి చోటే లేకుండా చేసాడు రాజమౌళి. ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో ఎక్కువ భాగం జనాలను ఆకర్షించడానికి కమర్షియల్ అంశాలు ఉంటాయి. అయినప్పటికీ, కథ చెప్పడం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే జక్కన్న తీసిన ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ వంటి సినిమాలను బట్టి అతను ఎలాంటి సినిమాలనైనా సులువుగా తీయగలడని మనం గ్రహించవచ్చు.

అలాగే ‘బాహుబలి’ చూసిన తర్వాత, అతని విజన్‌ మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. బాహుబలి సినిమా వచ్చాక ఎక్కడైనా ఆ సినిమా టాకే. ఎక్కడెక్కడ వాళ్ళో బాహుబలిని చూసారు. సినిమా అంటే బాహుబలి అన్నట్టు చెప్పుకున్నారు. బాహుబలి చిత్రం సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది అనే విషయం వేరే చెప్పనవసరం లేదు. ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ ఈ జూలై 10వ తేదీ తో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పటిలో ఈ చిత్రం 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సంపాదించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

ఇప్పటికి కూడా ప్రేక్షకుల కన్నులకు కట్టినట్లుగా ప్రతి సన్నివేశం గుర్తుండి పోయేలా ఉంది ఈ చిత్రం. బాహుబలి చిత్రం తో దర్శకుడు రాజమౌళి మరియు హీరో ప్రభాస్ ప్రపంచం మొత్తంలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

అయితే బాహుబలి-3 ఉంటుందన్న దానికి రాజమౌళి ఇంత పెద్ద క్లూ ఇచ్చేసారు. మీరు దీనిని గమనించారా..? బాహుబలి-2 సినిమా అయిపోయిన తర్వాత చిన్న పాప చెప్పిన మాటల్ని విన్నారా..? మహేంద్ర బాహుబలి మాహిష్మతి కి రాజు అవుతాడా అని ఒక పాప ప్రశ్నిస్తుంది. ఏమో శివయ్య మనసులో ఏమనుకుంటున్నారో నాకేం తెలుసు అని తనికెళ్ల భరణి అంటారు. అయితే మరి బాహుబలి 2 లో మూడవ పార్ట్ కి సంబంధించిన క్లూ ఇది అని మనం అనుకోవచ్చు.