పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ ప్రభాస్ అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది.

Video Advertisement

ఈ టీజర్ బాహుబలి టీజర్ రేంజ్ లో ఉంటుందని భావించిన ఫ్యాన్స్ అందుకు భిన్నంగా ఉండటంతో ఫీలవుతున్నారు.

fans getting doubts about aadipurush result

బాహుబలి, బాహుబలి2 సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలేవీ అంచనాలు అందుకోలేదనే సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్ కథ, కథనంలోని లోపాల వల్ల ఫ్లాప్ అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్ కు ఇప్పుడు ఒక హిట్ అవసరం. కొంత మంది ఈ టీజర్ పూర్తిగా కార్టూన్ షో లాగా ఉందని భావిస్తుంటే మరికొందరు యానిమేషన్ చేసినట్టుగా ఉందని చెప్తున్నారు.

ఇక ఒక వర్గం ప్రేక్షకులు అయితే మా ప్రభాస్ ని కావాలనే పాన్ ఇండియా స్టార్ గా వెలగనివ్వకుండా అడ్డుకుంటున్నారు అని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ సినిమాని మాములుగా తీసి ఉంటే బాగుండేది. అందరికీ నచ్చేది. నాణ్యత లేని విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రేక్షకులకి నెగటివ్ ఫీలింగ్ ని తీసుకు వస్తున్నాయి.

fans getting doubts about aadipurush result

ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ పొట్టి ఉంగరాల జుట్టు పెద్ద గడ్డంతో కనపడుతున్నాడు. ఆయితే అది రావణాసురిడిలా కాకుండా అల్లావుద్దీన్ ఖిల్జీలా ఉందని నెటిజన్లు అంటున్నారు. అలానే అతని పాత్ర పై కన్నడ నటి, బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ ఇలా అంటున్నారు… రావణుడి పాత్ర ఎలా ఉంటుందో దర్శకుడికి తెలియలేదన్నారు.

ఎన్టీ రామారావుని కానీ డాక్టర్ రాజ్‌కుమార్‌ ని కానీ చూస్తే తెలుస్తుందన్నారు. లేదంటే ఎస్వీ రంగారావు చేసిన సంపూర్ణ రామాయణం సినిమా చూసినా తెలుస్తుందన్నారు. పైగా రావణుడు శివ భక్తుడు. బ్రాహ్మణుడు. 64 కళల్లో దిట్ట అన్నారు.

కానీ ఈయన మాత్రం టర్కిష్ నిరంకుశుడులా ఉన్నాడని… రావణుడు లాగ కాదు అని అన్నారు. రామాయణాన్ని, చరిత్రను బాలీవుడ్ సరైన విధానం లో చూపించడం లేదని దీనిని మనుకోమని ఆమె అన్నారు. ఎన్టీ రామారావు గురించి మీరు విన్నారా అంటూ ఆమె ట్వీట్ చేసారు.