Ads
ఈ మధ్య కాలంలో క్రేజ్ ఉన్న ప్రాజెక్టులను కరెక్ట్ గా పరిశీలిస్తే ఎక్కడో ఒకచోట మలయాళం టచ్ కనిపిస్తుంది. ప్రతిభ ఉన్నవాళ్ళకి టాలీవుడ్ ఎప్పుడు పెద్ద పీట వేస్తూనే ఉంటుంది. అందుకే ఈ మధ్య మలయాళీ మెరుపులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Video Advertisement
అంతే కాకుండా..మాలీవుడ్ హీరోలు చేసిన తెలుగు సినిమాల మీద మనవాళ్లు స్పెషల్ అటెన్షన్ పెడుతున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అయినా, కథలో బలం ఉన్న సబ్జెక్ట్ అయినా, సినిమాకు ప్యాన్ ఇండియా అప్పీల్ కావాలనుకుంటున్న ప్రతి సారీ మేకర్స్ మలయాళ హీరోల మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆలా తెలుగు తెరపై అలరించిన మలయాళీ హీరోలు ఎవరో చూద్దాం..
#1 మమ్ముట్టి
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘స్వాతి కిరణం’ చిత్రం తో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తెలుగులోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యం లో వచ్చిన ‘యాత్ర’ చిత్రం లో కూడా ఆయన నటించారు.
#2 మోహన్ లాల్
మలయాళం లోని మరో స్టార్ హీరో మోహన్ లాల్ కూడా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘జనతా గ్యారేజ్’ చిత్రం లో ఒక కీలక పాత్రలో నటించారు. అంతే కాకుండా 1994 లో వచ్చిన గాడీవం చిత్రం లో కూడా అతిధి పాత్రలో మెరిశారు మోహన్ లాల్.
#3 దుల్కర్ సల్మాన్
ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి నోటా ఒకటే మాట. ‘సీతారామం’ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నాం అని. రామ్‌గా దుల్కర్ సల్మాన్ యాక్టింగ్‌కి ఫిదా అయిపోయారు జనాలు. దుల్కర్‌కి తెలుగులో ఇదేం ఫస్ట్ స్ట్రయిట్ సినిమా కాదు. ఆల్రెడీ మహానటి చేశారు. ఇప్పుడు సీతారామం తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేశారు.
#4 ఫాహద్ ఫాజిల్
విలన్‌గా తెలుగులో సాలిడ్ ఎంట్రీ ఇచ్చారు ఫాహద్ ఫాజిల్. పార్టీ లేదా పుష్పా అని ఆయన సినిమాలో బన్నీని అడిగినా, ఆయన పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన వారు మాత్రం పార్టీ లేదా ఫాహద్ అని అడుగుతున్నారు. తెలుగులో పుష్ప, తమిళ్‌లో విక్రమ్, మలయాళంలో హీరోగా చేసిన సినిమాలు అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్లున్నాయి ఫాహద్ ఖాతాలో.
#5 దేవ్ మోహన్
‘శాకుంతలం’ సినిమాలో శకుంతలగా సమంతకు ఎంత క్రేజ్ ఉందో, అంతకు మించి వైరల్ అయింది దేవ్ మోహన్ పేరు. మలయాళంలో దేవ్ ఫిల్మోగ్రఫీ కూడా పెద్దదేం కాదు. కానీ దుష్యంతుడి కేరక్టర్‌కి పక్కాగా సెట్ అవుతారని సెలక్ట్ చేసుకున్నారు డైరక్టర్ గుణశేఖర్.
#6 ఉన్ని ముకుందన్
యశోదలోనూ మలయాళ హీరోతోనే జోడీ కడుతున్నారు సమంత. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది యశోద. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. యశోదలో డాక్టర్‌గా కనిపిస్తున్నారు ఉన్నిముకుందన్. గతంలో స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేశారు ఉన్నిముకుందన్.
#7 పృథ్విరాజ్
లూసిఫర్ రీమేక్, బ్రో డాడీ, రీసెంట్‌గా జనగణమన అంటూ హిట్ల మీద హిట్లు కొడుతున్నారు పృథ్వి రాజ్. సాలిడ్ కంటెంట్ తో జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు పృథ్విరాజ్. అందుకే ఆయన్ని సలార్‌లో కీ రోల్‌కి తీసుకున్నారు ప్రశాంత్ నీల్.
#8 రోషన్ మాథ్యూ
నాచురల్ స్టార్ నాని తదుపరి సినిమా దసరా చిత్రంలో రోషన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
వీళ్ళే కాకుండా రెహమాన్, అజ్మల్ అమీర్, కళాభవన్ మణి, రఘువరన్, బిజూ మీనన్ వంటి నటులు సహాయ నటులు, ప్రతినాయక పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించారు.
End of Article