Ads
సౌత్ లోనే కాకుండా భారతీయ సినిమాలో డిఫరెంట్ కథలు మరియు కథనాలతో ఆకట్టుకునే సినిమాలకు పేరుగాంచిన ఇండస్ట్రీ, మాలీవుడ్. సింపుల్ కథని సైతం కట్టిపడేసేలా చెప్పడంలో మలయాళ దర్శకులను మించిన వాళ్లు లేరు. ఓటీటీలు వచ్చిన తరువాత తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలకు చేరువయ్యారు.
Video Advertisement
మలయాళం నుండి ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో కొత్త చిత్రాలు మాత్రమే కాకుండా నాలుగైదు ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. వాటిలో 5మలయాళ థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీలలో దూసుకెళ్తున్నాయి. ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.కన్నూర్ స్క్వాడ్:
మాలీవుడ్ మెగా స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన కన్నూర్ స్క్వాడ్ సినిమా గత ఏడాది విడుదల అయ్యింది. కేరళలో రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి, సూపర్ హిట్ అయిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.
2.జోజి:
ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మూవీ విలియం షేక్‌స్పియర్ రచించిన మ్యాక్‌బెత్ నాటకం ఆధారంగా రూపొందిన క్రైమ్ డ్రామా. 2021 నుండి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
3.రోర్షాక్:
మలయాళ అగ్ర హీరో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇది. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
4.వైరస్:
2018లో కేరళను భయపెట్టిన నిఫా వైరస్ ఆధారంగా రూపొందిన మెడికల్ థ్రిల్లర్ సినిమా ఇది. కుంచాకో బోబన్, టోవినో థామస్, రేవతి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 2019లో విడుదల అయ్యింది. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
5.గరుడన్:
గతేడాది థియేటర్లలో విడుదల అయిన గరుడన్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అరుణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి, బిజు మీనన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
End of Article