సినీ పరిశ్రమ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయి.కొత్తగా పరిశ్రమకు వచ్చే నటులు ఒకే ఒక్క ఛాన్స్ అని ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం చిత్రసీమలో నటులుగా కొనసాగుతున్నప్పటికీ సరైన అవకాశం రాక ఎదురుచూస్తుంటారు.ఆలా అవసరం ఉన్నవారికి కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు ..ఈ కాస్టింగ్ కౌచ్ ల గురించి అప్పట్లో టాలీవుడ్ లో  చర్చనీయాంశం అయింది.బుల్లితెర నుండి వెండితెర వరకు చాలా మంది ఎదో ఒక సందర్భంలో చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు.

 

తాజాగా మరొక నటి ఒక పాపులర్ నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేసింది .బాలీవుడ్ కి చెందిన మల్హర్ రాథోడ్ కొన్ని సందర్భాల్లో తనపై చెడుగా ప్రవర్తించారని తెలిపారు .చాలామంది నిర్మాతలు దర్శకులు అవకాశాలు ఇస్తామని కోరిక తీర్చమని వేధింపులకు గురి చేస్తారని మరికొందరైతే మరెక్కడా అవకాశాలు రాకుండా వెనకనుంచి కెరీర్ ను దెబ్బ తీసే విధంగా ప్రయత్నం చేస్తుంటారని మల్హార్ రాథోడ్ వివరణ ఇచ్చింది. అదే విధంగా సిని రంగంలో అవకాశాలు రావడం అంటే చాలా కష్టం అని ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని అన్నారు.

ఎనిమిది సవంత్సరాల క్రితం ఒక సీనియర్ నిర్మాత నన్ను వేధింపులకు గురిచేసాడని చెబుతూ అసలు విషయం బయటపెట్టింది ఈ నటి .ఆమె మాట్లాడుతూ.. సీరియల్ లో నటిగా అవకాశం ఇస్తాను అని ఒక 65ఏళ్ళ నిర్మాత రూమ్ లోకి రమ్మన్నాడు. షర్ట్ బటన్ విప్పేయ్ కాస్త నిన్ను చూడాలని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అది విని నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.

ఆ నిర్మాత ప్రవర్తించిన తీరు నన్ను ఆగ్రహానికి గురయ్యేలా చేసింది ..కొద్దిసేపట్లోనే అక్కడ నుండి వెళ్లిపోయానని తెలిపారు ..తనకు మొదటసారి ఎదురైన  లైంగిక వేధింపులకు కొన్ని రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెబుతూ …ఆ నిర్మాత ఒక్కడే కాదు ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని సీరియస్ గా కామెంట్స్ చేసింది ..

 

ఆ సమయంలో నటిగా మంచి స్థాయిలో నిలబడాలని ఎంతో ప్రయత్నం చేశాను ..నా కుటుంబానికి ఆర్థికంగా నేను ఒక్కదాన్నే ఆధారం .కాగా నేను ఎప్పుడు అవకాశాల కోసం చెడు మార్గాన్ని అనుసరించలేదు .నా ప్రతిభతో నాకు చిన్న పాత్రలు వచ్చినా  నాకు ఇష్టమే అని మల్హర్ రాథోడ్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు .