మమతా మోహన్ దాస్ పలు టాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈమె అందరికీ సుపరిచితమే. కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. యమదొంగ సినిమా ద్వారా ఈమె పరిచయమైంది. రెండు దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులు కూడా ఈమె అందుకుంది. 2010లో మలయాళంలో ఈమెకి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. 2010లో ఉత్తమ నటిగా కేరళ స్టేట్ ఫిలిం అవార్డుని ఈమె సొంతం చేసుకుంది.

Video Advertisement

యమదొంగ, కృష్ణార్జున, హోమం వంటి సినిమాల్లో ఈమె నటించింది. అయితే మమతా మోహన్ దాస్ తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఈమె ఒక టాప్ హీరోయిన్ మీద కామెంట్లు చేసింది. అయితే ఆ హీరోయిన్ కోసం చిత్ర బృందం చేసిన పని వలన ఈమె ఎంతగానో బాధ పడిందట. ఈ విషయాలని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. పైగా ఆ హీరోయిన్ వలన ఈమెకి నాలుగు రోజులు సమయం వృధా అయ్యిందని చెప్పింది మమత. రజనీకాంత్ నటించిన ఒక సినిమాలో ఈమెకి అవకాశం వచ్చింది అందులో పాట కోసం ఈమెని కాంటాక్ట్ చేశారు పైగా నాలుగు రోజులు పాటు షూటింగ్ కూడా చేశారు.

షూటింగ్ చేస్తున్నప్పుడు ఈమెకి అర్థమైంది ఏంటంటే తను ఫ్రేమ్ లో లేదని… ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత ఈమె అనుకున్నట్లుగానే ఈమె అందులో కనపడలేదు.  ఆ సినిమాలో నటించిన హీరోయిన్ వలన ఇలా జరిగిందని ఆమెకి కొంతకాలం తర్వాత తెలిసింది. ఆ పాటలో ఇంకో హీరోయిన్ ఉందని తనకు చెప్పలేదని తను ఉంటే షూటింగ్ కి రానట్లు ఆ హీరోయిన్ చెప్పిందని మమత చెప్పింది. అందుకనే మమత పాటని తొలగించారట. కానీ ఆ సినిమా కోసం ఆమె నాలుగు రోజులు సమయం వృధా చేసుకున్నానని… బాధగా అనిపించిందని తాజాగా మమతా చెప్పారు.

ఇక సినిమా ఏంటనే విషయానికి వస్తే.. అది రజనీకాంత్ నటించిన కథానాయకుడు సినిమా. 2008లో ఈ సినిమా విడుదలైంది.  ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించింది. మమతా మోహన్ దాస్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ”దేవుడే స్వర్గం నుంచి”… అని అందులో మమతా కనపడుతుంది. అయితే మమతా మోహన్ దాస్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది కథానాయకుడు సినిమా అని నాయన తార వల్లే ఆమె బాధ పడిందని అర్ధం అవుతోంది.