రోడ్డుపై తిరిగే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎంత అందంగా ఉంటుందో చెప్పే రియల్ స్టోరీ!

రోడ్డుపై తిరిగే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎంత అందంగా ఉంటుందో చెప్పే రియల్ స్టోరీ!

by Harika

Ads

ఇప్పటి కాలంలో చాలా మంది యువత ఆత్మ సౌందర్యం కన్నా, బాహ్య సౌందర్యాన్ని చూసి ఇష్టపడి ప్రేమించేవారే ఎక్కువ శాతం. తొలి చూపులోనే ప్రేమలో పడి, ఆ ప్రేమను సక్సెస్ చేసుకునేవారు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పవచ్చు. మనం చదవబోయే  ఈ ప్రేమ కథ ఎంతో అద్భుతంగా ఉంటుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మాటకి ఈ జంట పర్ఫెక్ట్ నిర్వచనం. మనం ఎప్పుడూ సినిమాల్లోనే చూస్తూ ఉంటాం కాని, నిజజీవితంలో కూడా ఇలాంటి లవర్స్ ఉంటారా అనిపిస్తుంది.

Video Advertisement

ఆమె పేరు లుజ్ యెసేనియా సెర్నా.  మెక్సికోలోని న్యూవో శాన్ జువాన్ కి చెందిన యువతి. ఈమె 2009 లో కార్లు కడుగుతున్న దుకాణంలో ఒక వ్యక్తిని చూసింది. తొలిచూపులోనే అతని ప్రేమలో పడిపోయింది. అతనే జువాన్ మెన్డోజా అల్విజార్. జువాన్ ఓ నిరాశ్రయులు. కార్లు తుడుచుకుంటూ వచ్చిన డబ్బుతో పొట్టను నింపుకునేవాడు. చింపిరి జుట్టుతో, మాసిన బట్టలతో వీధుల్లో తిరుగుతూ రోడ్లపై నిద్రపోయేవాడు. ఇతని మంచి గుణంతో ఎదుటివారితో ఇట్టే కలిసిపోయేవాడు. అతనిలో ఈ గుణమే సెర్నాని ఆకట్టుకుంది. తొలిచూపులోనే అతని ప్రేమలో పడిపోయింది సెర్నా.

జువాన్ తో పరిచయం ఏర్పడిన తర్వాత సెర్నా మొదటిగా అతడి చింపిరి జుట్టును కట్ చేయించింది. ఆ హెయిర్ కట్ తర్వాత జువాన్ లుక్ ఒక సినిమా హీరోలా మారిపోయింది.  ఇలా వీరిద్దరి ప్రేమ బంధం రెండు సంవత్సరాలు కొనసాగింది. తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి సెర్నా మరియు జువాన్ వివాహ బంధంతో ఒకటయ్యారు. వీళ్ళ పదేళ్ల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

ప్రస్తుతం కుటుంబ పోషణ కోసమై జువాన్ తాపీ పని మరియు ఖాళీ సమయంలో మొబైల్ ఫోన్లో రిపేర్లు వంటి పనులు చేస్తున్నాడు. సెర్నా తన అందమైన ప్రేమకథను మరియు జువాన్ రోడ్లపై తిరిగేటప్పుడు పాత చిత్రాలను, ఇప్పటి చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అ ఫొటోస్ చూసిన నెటిజన్లు సైతం ఆమె నిజమైన ప్రేమకు హ్యాట్సాఫ్ చెబుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


End of Article

You may also like